Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి ప్రారంభమైంది. ఇప్పుడే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఇక ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడం కష్టమే. ఈ ఎండలకు వేడిగాలులకు బయటకు వెళ్ళి వచ్చే సరికి చర్మం నల్లగా అయిపోతుంటుంది. చల్లని నీటితో కడిగినా కాస్త ఉపశమనమే ఉంటుందే తప్ప, పూర్తిగా ముఖంపై ఉన్న నలుపును తగ్గించదు. ఇందుకు ఇంట్లో ఉండే టమాటోతో చక్కటి పరిష్కారం ఉంటుంది.
- ఒక టొమాటోని తీసుకుని మధ్యకు కోసం, దానిని పంచదారలో అద్దాలి. దానిపై చిక్కని పెరుగు కొంచెం వేసి, ముఖంపై రుద్దుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు చేయడం వల్ల ముఖంపై ఏర్పడిన మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న నలుపు కూడా తగ్గుతుంది.
- ఒక ముక్క టొమాటో రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగు తీసుకుని మొత్తాన్ని మిశ్రమంలా చేసుకోవాలి. ఒక వేళ ఇదీ బాగా పల్చగా అనిపిస్తే ముల్తానీ మట్టి లేదా శెనగపిండిని కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో ప్యాక్‌లా అప్లై చేసుకుని ఆరాక చల్లని నీటితో కడిగేస్తే, చర్మం తాజాగా ఉంటుంది, మొటిమలు కూడా తగ్గు ముఖం పడతాయి.
- ఒక ముక్క టొమాటో రసానికి, చెంచా కొత్తిమీర రసం కలిసి ప్యాక్‌లా వేసుకుంటే కూడా ముఖంపై నలుపు సమస్య తొలగిపోతుంది.