Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాగుబోతులకు మద్యంపై ఎంత మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మందు కోసం వైన్‌షాపుల ముందు ఎంతసేపైనా వేచి చూసేందుకు సిద్దమవుతారు. నీరులాగానే బీరు కూడా పైప్‌లైన్ ద్వారా ఇంట్లోకే వస్తే ఎంత బాగుండో అని అప్పుడప్పుడు ఫీీలవుతారు. అలాంటి వారికోసం నిజంగానే మద్యం సరఫరా చేయడానికి పైప్‌లైన్ వేస్తున్నారు ఓ వేడుక నిర్వాహకులు. జర్మనీలోని వాకెన్ పట్టణంలో ఏటా ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. స్థానికులు ఇతర ప్రాతాల వారు వచ్చి పచ్చటి పొలాల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో ఎంజారు చేస్తుంటారు. అందుకు పట్టణం నుంచి పొలాల్లోకి ఆరున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ పైప్‌లైను ఏర్పాటు చేసి దాని ద్వారా బీరు సరఫరా చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు తగ్గి, ట్రాఫిక్ సమస్యకూడా తలెత్తదని నిర్వాహకులు చెబుతున్నారు. మన దగ్గర కూడా ఇలాంటి పైప్‌లైన్ వేస్తే..? చుక్కకూడా గమ్యం చేరదు. కారణం! మన వాళ్లుచేసే పనుల నాణ్యత మీకు తెలియందా? అంతా లీకుల మయమేగా..!
- పుప్పాల