Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు పంపారు?
కొడుకు : నాన్నా... చూచి రాత మంచిదేనా?
తండ్రి : చాలా మంచిది... రోజూ రాయాలి
కొడుకు : నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?
కామెంట్ ఫలితం!
భర్త : ఏంటిది? నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేశావా? నేను భోజనం చేయాలా? వద్దా?
భార్య : అవునా.. అసలు బెండకాయ వెరైటీలంటే మీకు ఇష్టం లేదా..? మరి ఎవరో ఫేస్బుక్ గరల్ ఫెండ్ పేజీలో బెండకాయ కూర ఫోటో పోస్ట్ చేస్తే.. వావ్ నోరూరుతుంది.. మీ వంట టేస్ట్ అదిరిపోతుంది.. ఇంటి భోజనానికి ఎప్పుడు రమ్మంటారు. అని కామెంట్ చేశారే.. ఇప్పుడు తినండి.
ఇంత త్వరగానా?
దుబారుకి వెళ్తున్న ఓ స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి హైదరాబాద్లో వున్న తన ఇంటికి తిరుగుపయనమయ్యాడు ఓ వ్యక్తి.
ఓ ఐదు గంటల తర్వాత సోషల్ మీడియాలో స్నేహితుడి స్టేటస్ : ఎంజాయింగ్ ఎట్ బుర్జ్ ఖలీఫా
హైదరాబాద్లో మిత్రుడి స్టేటస్ : క్రాసింగ్ చాదర్ఘాట్
అకౌంట్ హ్యాకింగ్
భార్య : ఏవండీ, మీ అకౌంట్ హ్యాక్ అయ్యింది
వెంగళప్ప : ఏ అకౌంట్?
భార్య : మీ బ్యాంక్ అకౌంట్!
వెంగళప్ప : హాడలగొట్టేశావ్, ఇంకా నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకయ్యిందేమో అనుకున్నా!'