Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పై కప్పుకి రకరకాల ఆకారాల అద్దాల మధ్య వెలిగే లైట్లు (షాండ్లియర్) చాలా అందంగా కనిపిస్తాయి. వీటి ఖరీదు ఎక్కువే. కానీ అటువంటి వాటిని తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగంటే... కార్డుబోర్డు అట్టముక్క, కత్తెర, గ్లూ, ఇష్టమైన రంగు ఫాబ్రిక్ పెయింట్, బ్రష్.
కార్డుబోర్డు అట్టముక్కకి ఒకవైపు పలుచగా తెలుపు కానీ ఏదైనా ఇష్టమైన రంగు కానీ ఫాబ్రిక్ పెయింట్ వేసుకోవాలి. రంగు పూర్తిగా ఆరిపోయిన తర్వాత కార్డుబోర్డు అట్టని ఐదు ఇంచుల వెడల్పుతో పొడవుగా, ఐదారు ముక్కలు కత్తిరించుకోవాలి. ఈ అట్టముక్కలని మధ్యలో సమాన దూరం వుండేట్టు చూసి, పంచభుజాలుగా వచ్చేట్టు మడుచుకోవాలి. తర్వాత రెండు చివర్లని అతికించాలి. తర్వాత ఈ పంచభుజి ఆకారంలో వున్న వాటిని ఒక దానిమీద ఒకటి బొమ్మలో చూపిన విధంగా గ్లూతో అతికించుకోవాలి. పంచభుజి ఆకారంలోనే వెడల్పుగా మరో అట్టముక్కని కత్తిరించుకుని మధ్యలో రంధ్రం చేయాలి. దానిలో బల్బు హోల్డర్ పెట్టాలి. హోల్డర్ పెట్టిన అట్టముక్కకి ఐదారు దొంతరలుగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆకారాన్ని అతికించాలి. చూశారుగా... కార్డుబోర్డు అట్టతో షాండ్లియర్ లైట్ తయారైపోయింది.