Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పడమటి దేశాన ఉయ్యాలో డొల్లాటి రాజ్యం ఉయ్యాలో
పడమటి పట్నం ఉయ్యాలో పట్నమున్నాదమ్మ ఉయ్యాలో
దేశాన్ని ఏలేటి ఉయ్యాలో రాజులెవ్వరమ్మ ఉయ్యాలో
కాంబోజ రాజు ఉయ్యాలో రాజు ఉన్నాడమ్మ ఉయ్యాలో
ఆ రాజు భార్య ఉయ్యాలో కాంబోజ లచ్చమ్మ ఉయ్యాలో
రాజ్యాలు ఉన్నాయి ఉయ్యాలో దేశాలు ఉన్నాయి ఉయ్యాలో
ఎన్ని ఉన్నాగాని ఉయ్యాలో ఏమి లాభమమ్మ ఉయ్యాలో
సంతానం లేక ఉయ్యాలో సింత సేస్తాడమ్మ ఉయ్యాలో
అమ్మా అని పిలిచే ఉయ్యాలో ఆడిబాల లేదు ఉయ్యాలో
బాపు అంటూ పిలవ ఉయ్యాలో మగబాలుడు లేడు ఉయ్యాలో
నోములు నోమంగా ఉయ్యాలో పూజలు చేయంగా ఉయ్యాలో
ఆడబిడ్డ కూడా ఉయ్యాలో రాజుకు కలిగింది ఉయ్యాలో
కాంబోజరాజు ఉయ్యాలో సంతోషపడతడు ఉయ్యాలో
సంతోషపడతడు ఉయ్యాలో సంబరపడతడు ఉయ్యాలో