Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్లు, ఇంజనీర్లు, మరేదో వృత్తి. నెల తిరిగేసరికి జీతం రూపంలో ఆదాయం... కాకపోతే ఒకేసారి ఆదాయం వచ్చి పడే బిజినెస్... ఇలా ఉన్నవారిదే జీవితం. ప్రపంచ జనాభా అందరి కడుపు నింపే రైతు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రైతన్న, అన్నదాత వంటి పేర్లలో గౌరవం తప్పితే... వారి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. నిజానికి దుర్భరమనే చెప్పాలి. ప్రకృతి, ప్రభుత్వం సహకరించక అప్పులపాలైన ప్రతి రైతూ చుట్టుపక్కల వారికి లోకులే. అప్పిచ్చిన వారికి మరీ! ఎరువులు కొట్టు యజమాని 'అప్పుకింద మీ ఆవిడ్ని పంపించు... మా ఇంట్లో పనికి' అంటే, వడ్డీ వ్యాపారి 'నీ కొడుకుని తీసుకుపోతా మా పొలంలో పని చేయడానికి' అంటాడు. ఇన్ని అవమానాలను తట్టుకుని బతికే ధైర్యంలేక చనిపోతే... ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించిన ఆ రైతు ఎన్ని కష్టాలు వచ్చినా, అప్పులపాలైపోయినా బతకాలనే నిర్ణయించుకుంటాడు. భూమితల్లిని నమ్ముకుని మరోసారి, ఇంకోసారి ప్రయత్నిద్దామనే ఆలోచిస్తాడు. అదీ రైతుకి భూమికి వున్న అనుబంధం. ఇదే విషయాన్ని 'రైతు' లఘుచిత్రంలో ఎంతో హృద్యంగా చూపించారు.
https://www.youtube.com/watch?v=oIy28yaNJak