Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్‌లో 1900 ఏండ్లనాటి ఓ మిలిటరీ అధికారి ఇంటిని కనుగొన్నారు. ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బయటపడిన విశేషాలు ఆనాటి సైనికులకు ఎటువంటి వసతులు కల్పించారో తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. రోమ్‌లోని మెట్రో సి లైన్‌ను పొడిగించే పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు నలభై అడుగుల లోతులో ఒక కట్టడం అవశేషాలు కనిపించాయి. వెంటనే పురావస్తు శా్తవేత్తలు రంగప్రవేశం చేసి శాస్త్రీయంగా తవ్వకాలు ప్రారంభించారు. ఆ కట్టడాన్ని రోమ్ సామ్రాజ్యం విలసిల్లిన కాలంలో ఉన్నతవర్గీయులు (కులీనులు) నివసించే ఇల్లు (డోమస్)గా నిర్ధారించారు. నిజానికి ఈ గృహం 2016లో బయటపడిన మిలటరీ బ్యారక్స్కి దగ్గరలోనే ఉంది. అందువల్ల దీనిని పెద్ద సైనికాధికారి నివసించిన గృహంగా భావిస్తున్నారు. ఈ సైనికుల బ్యారక్స్, కమాండర్ గృహం హర్డియన్ చవ్రర్తి కాలం (క్రీ.శ.117-138)లో నిర్మితమై ఉండవచ్చని భావిస్తున్నారు.
బయటపడిన సైనికాధికారి గృహం సుమారు మూడు వేల రెండు వందల ముప్పరు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 14 గదులు ఉన్నాయి. పెరడు, ఫౌంటెయిన్స్ ఉన్నాయి. గదుల నేలను తెల్లటి చలువరాయి, గ్రే పలకరాయితో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. ప్లాస్టర్‌తో రూపొందించిన పెయింటింగ్స్ ఆనవాళ్లు ఇప్పటికీ ఇంటి గోడలకు వేలాడూతూనే ఉన్నాయి. 2017లో సబ్వే నిర్మాణంలో భాగంగా తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద నీటికాలువ (అక్విడెక్ట్) కొలోసియం సమీపంలో బయటపడింది. బహుశ రోమ్ నగరం మధ్యకు మంచినీటిని సరఫరాచేయడానికి దీనిని నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది సుమారు 2300 ఏండ్ల క్రితం నాటిదని అనుకొంటున్నారు.