Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుని పట్టుదల - కార్యదీక్షకు ఉదాహరణగా ఎర్నెస్ట్ హెమింగ్వే 'ఓల్డ్ మాన్ అండ్ సీ'ని ప్రస్తావించడం మన విమర్శకులకు పరిపాటి. కేశవరెడ్డి 'అతడు అడవిని జయించాడు'కు ముందుమాట రాసిన పురాణం, ఆ నవలను 'ఓల్డ్ మాన్ అండ్ సీ' తో పోల్చి ఆకాశానికి ఎత్తేశారు. మహేంద్ర రాసిన 'స్వర్ణసీమకు స్వాగతం'కు సమీక్ష రాసిన ఒక పెద్దమనిషి కూడా ఆ నవలను 'ఓల్డ్ మాన్ అండ్ సీ'తోనే పోల్చాడు. అప్పటి నుండి ఈ పుస్తకాన్ని తెలుగులో చదువుదామని ప్రయత్నిస్తే ఎక్కడా దొరకలేదు. చిన్న కథలనే వెతికి వెతికి అనువాదం చేసేవారికి కూడా ఈ చిన్ని నవల కనిపించకపోవడం ఆశ్చర్యం. విచిత్రంగా ఈ మధ్య కాలంలోనే ఈ చిన్ని నవలకు రెండు అనువాదాలు రావడం విశేషం.
- కె.పి.అశోక్‌కుమార్, 9700000948