Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీడల పైన వచ్చే వ్యాసాలు విడవకుండా చదవటం అలవాటు. క్రీడలు అందమైన కలేనా అంటూ... మీరు ప్రచురించిన ప్రధాన వ్యాసం ఎంతగానో ఆకట్టుకొంది. తెలుగు రాష్ట్రాల బాలలు పాథమిక స్థాయిలోనే ఆటలకు ఏవిధంగా దూరమవుతున్నారో... ఆటలను ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాయో ఈ వ్యాసం ద్వారా చెప్పారు. క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తున్న కారణంగానేప్రపంచ స్థాయి పోటీల్లో మనం ఎంతగానో వెనుకబడిపోతున్నాం. ఇలాంటి విలువైన వ్యాసాలతోనైనా... ప్రభుత్వాలు, సమాజం కళ్లు తెరవాలి. ఇకనైనా తప్పులు సవరించుకొనే దిశగా చర్యలు తీసుకోవాలి.
- ప్రకాశ రావు, కరీంనగర్; వెంకటరామ సందీప్, మహబూబ్ నగర్