Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతికినన్ని రోజులు తినీ తినక కష్టాలు పడి తమ సంతానాన్ని చదివించి ప్రయోజకులను చేయాలని ప్రతి తల్లిదండ్రులూ ఆరాటపడుతుంటారు. ఎన్నో కోరికలు తమ మదిలో ఉన్నా వాటిని తీర్చుకునేందుకు డబ్బులేక ఊహల పల్లకిలోనే ఊరేగుతుంటారు. కొడుకులు ఎదిగాక తమ కోసం ఇంత జేసిన తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని ఆరాటపడే కొడుకులూ ఉంటారు. అలాంటి ఘటనే నైజీరియాలోని మారుమూల గ్రామమైన ఎంబోసిలో జరిగింది. అజుబకి అనే వ్యక్తి తన తండ్రిని ఎప్పటికైనా ఖరీదైన కారులో తిప్పుతానని తరచూ చెప్పేవాడు. కానీ అతని కోరిక తీరక ముందే తండ్రి చనిపోయాడు. ఎలాగైనా తన తండ్రి కోరిక తీర్చాలని భావించి అప్పటికప్పుడు ఏకంగా బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారును తెచ్చి తన తండ్రి మృతదేహాన్ని అందులోఉంచి పెద్ద గుంతను తీసి కారుతో సహా సమాధి చేశాడు. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్‌ను ఏర్పాటు చేశాడని స్థానిక పత్రిక వార్త రాసింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. తండ్రిపై అజుబుకి ఉన్న ప్రేమను కొందరు సమర్థిస్తుంగా, దీనికి ఖర్చు చేసిన మొత్తం పేదలకు సాయంచేసేందుకు ఉపయోగిస్తే బావుండేదని మరి కొందరు వ్యాఖ్యానించారు. దీనిపై ఓ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
- పుప్పాల