Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏకీభవిస్తున్నాం
తరతరాలుగా పాతుకుపోయిన నిర్హేతుక భావాలకు బానిసలుగా బందీలై బతుకు బండి లాగుతున్నవారు మనలో చాలా మంది ఉన్నారు. బడిలో, గుడిలో, ఇంట్లో ఈ భావాలకు ఆజ్యం పోస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనా ధారను వ్యాప్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనే 'అంతరంగ' కథనంతో ఏకీభవిస్తున్నాం. డిచ్పల్లి రామాలయ నిర్మాణం గురించి చదివి మన పూర్వీకుల శిల్పకళానైపుణ్యానికి 'ఫిదా' ఐపోయాం. భారత రాజ్యాంగంలోని నిర్దేశక నియమాలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నవి కూడా. మహా కూటమి గురించి ప్రజల మనోభావాలను 'చౌరస్తా' తనదైన శైలిలో విశ్లేషింది. 'ఎలెక్షన్ మూడ్స్' కవిత ఈ నేతల, దూతల అసలు రహస్యం అడిగిన ప్రశ్నకు జవాబు ప్రతి ఓటర్ చెప్పాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన ప్రజాస్వామిక ప్రభుత్వం కోరుకునే వారు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.
- పంజాల నరసయ్య, హైదరాబాద్
జీవితంలోని నీలి నీడలు
'అసంపూర్ణ కవిత అన్నపూర్ణాదేవి'వ్యాసం వంశీకృష్ణ గారు బాగా అందించారు. ఒక ప్రతిభావంతురాలి జీవితంలోని నీలినీడలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
- రాంభక్త పద్మావతి
వ్యాసం బాగున్నది
28 అక్టోబర్ నవతెలంగాణ 'సోపతి'లో 'ఈ సౌందర్యం వెనుక చెమట చుక్కలెవరివో' ముఖచిత్ర వ్యాసం బాగుంది. చర్నాకోల కార్టూన్లు నవ్విస్తున్నాయి. 'అసంపూర్ణ కవిత అన్నపూర్ణాదేవి' గురించి అనేక విషయాలు అందించినందుకు రచయితకు కృతజ్ఞతలు. 'ఆధునికతకు బలవుతున్న సంప్రదాయక కళలు' పేరుతో సినిమా వ్యాసం అద్భుతం.
- గుండు రమణయ్య, పెద్దాపూర్- పెద్దపల్లి
అద్భుతంగా ఉంది
అక్టోబర్ 28 ఆదివారం రోజున ప్రచురించిన 'సోపతి'లో ''ఆధునికతకు బలవుతున్న సాంప్రదాయ కళారూపాలు''ఎంతో అదుÄ్భతంగాను, చాలా బాగాను వుంది .ఇలానే ప్రతి వారం మంచి మంచి కథనాలు ప్రచురించగలరని కోరుకుంటున్నాం .
- లోకం భానుచందర్, ముస్తాబాద్
ఈ కోణంలో రాయలేదు
డిచ్పల్లి ఖిలా రామాలయం గురించి మీరు ప్రచురించిన కవర్ స్టోరీ అద్భుతంగా ఉంది. అంత అందమైన శిల్పాలతో నిలువెత్తు ఉన్న దేవాలయాన్ని కొండపై నిర్మించడం ఎంతో శ్రమతో కూడిన పని. ఆ పనిలో చెమడోడ్చినవారిని గూర్చి రాయడానికి ప్రయత్నించడం అభినందనీయం. ఇంతకు ముందు రాసినవారెవరూ ఈ కోణంలో రాయలేదు. పూర్వం మధ్య యుగాల్లో గుడులు కట్టేటప్పుడు రాయిని క్వారీ నుంచి సేకరించడానికి, తరలించడానికి, రాళ్లపై శిల్పాలు చెక్కడానికి, పునాది నుంచి పూర్తయ్యే వరకు గుడి నిర్మించినవారి వివిధ హోదాల పేర్లు, అవి పేర్కొనబడిన శాసనాలతో సహా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. బాగా రాశారు. కృతజ్ఞతలు.
- రాము, కొత్తగూడెం