Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనిల్ బాబాయి అమెరికా వెళ్ళడంతో అనిల్ ఆలోచనలన్నీ బాబాయి చుట్టూ, అమెరికా చుట్టే వుంటాయి. ఆమెరికాలో కాల్పులకు గురయి చనిపోయిన బాబాయి శవం ఇంటికి వస్తే, ఊళ్ళో పెద్దగా ప్రతిస్పందన కనిపించదు. అదే ఒక విప్లవ కార్యకర్త ఎన్కౌంటర్ ఆ ఊళ్ళో ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. అతడు ఊరికి, ఊళ్ళోవాళ్ళకు చేసిన ఉపకారాలు, త్యాగాలు అనిల్‌ను ఆకర్షిస్తాయి. అమెరికా వెళ్ళిన బాబాయి కంటే, ఒక విప్లవ కార్యకర్త ఎన్నో రెట్లు ఉన్నతుడని గుర్తిస్తాడు. ఇంకో కథలో కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసిన బెంజిమన్ వల్ల ఆ గ్రామం, గ్రామంలోని మనుషులు ఎలా బాగుపడ్డారో చెబుతారు. వీర బ్రహ్మచారి రాసిన ఈ విధమైన కథలతో 'అసలు దారి' పుస్తకం విలక్షణంగా ఉంది. ఆలోచింపజేసే కథాకథనంతో మంచి కథల సమాహారంగా రూపొందింది ఈ సంపుటి.
- కె.పి.అశోక్‌కుమార్, 9700000948