Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిగా తన జీవితాన్ని ప్రారంభించిన తిర్మల్ ఈ మధ్య విస్తృతంగా వచనరచనలు చేస్తున్నారు. సాహిత్య, సామాజిక, విద్యాసంబంధమైన అంశాల్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాస్తున్నారు. ఇంతకు ముందు 'చురక-' శీర్షికన ఒక పుస్తకం వచ్చింది. ఇపుడు 'చురక-2' పేరుతో 46 వ్యాసాల్ని ఒకచోట చేర్చి మరో పుస్తకంగా తీసుకువచ్చారు. శ్రీశ్రీ, కాశీపతి, కేశవదాస్, మహాశ్వేతాదేవి, గూడ అంజయ్య, కానూరి వెంకటేశ్వరరావు, హీరాలాల్మోరియా గురించి విపులంగా రాశారు. అలాగే విద్యారంగంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ, రావలసిన సంస్కరణల్ని వివరిస్తూ కొన్ని వ్యాసాలు రాశారు. విద్యా, ఉపాధ్యాయ రంగాల్లో పనిచేసేవారు వీటిని చదవాలి. వామపక్ష ఉద్యమాల్లో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు ఉపయోగపడే విలువైన వ్యాసాల సర్వస్వమిది.
- వికర్ణుడు