Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.హరనాథ్ పరిణతి చెందిన కవి. స్పందించే హృదయం, భావనల్ని అక్షరాల్లో వ్యక్తపరిచే నేర్పూ ఉన్నాయి. తన కలల సుందరితో తన అనుభూతులను, స్పందనను 72 ఖండికల ద్వారా పంచుకుంటున్నాడు. రాగ మోహనం అంతా 'అనురాగమే'. సారళ్యత, క్లుప్తత, భావసాంద్రత 'ట్రేడ్మార్కు'లా నిలిచిపోయే ఈ కవితా సంపుటి ప్రపంచమంతా ప్రేమేనని, ప్రేమే ప్రపంచం అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాగరంజితమైన కవిత్వమిది.
- కూర చిదంబరం, 8639338675