Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన చర్మస్పర్శ కూడా మనకు ఎన్నో విషయాలను బోధపరుస్తుంది. వాతావరణ మార్పులు, ఎండ, చలి, వర్షపుగాలి మనకు మన స్పర్శజ్ఞానమే తెలుపుతుంది. విషయగ్రహణ కోసం కళ్ళు ఒక్కటే ప్రాధాన్యం కాదు. ఈ ఆలోచనతో ఒక గమ్మత్తయిన సిద్ధాంతాన్ని వెలికితీసింది అంజుమ్ సింగ్.
అతి వేగంగా ముందుకు నడుస్తున్న మన కాపిటల్ మార్కెట్ వలన, పట్టణాభివృద్ధి పలు దిశలుగా మారుతూ వుంటుంది. ప్రతీ ప్రదేశానికీ అక్కడి కర్మాగార పరిశ్రమలు, కట్టడాలు, ఇళ్ళు, భవంతుల వలన ఒక ప్రత్యేక గుర్తింపు ఆ పట్టణానికి తెస్తాయి. అంటే ఆ పట్టణానికి చిహ్నం ఆ గుర్తులే కదా! ఆ గుర్తింపు ఆ పట్టణానికి స్పర్శ అంటుంది.
అభివృద్ధి చెందే పట్ణణాలకు మరో కోణంలో విరిగిపోయిన పాత సామానుల గదిలాగా, పనిచేసే కార్మికుల నివాస స్థలాలు, రంగులేస్తున్న పాత డబ్బాలు, విరిగిన రేకులు అతుకులు పెట్టే పనివారు... ఇవి ప్రతి పట్టణానికి మరో గుర్తింపు తెస్తాయి, ఆ కాలనీల ఘాటైన రంగుల మురుగు వాసనలతో.
అంజుమ్ తన కళాకృతులను చేస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో ఆలోచనలని వ్యక్తపరిచే పని చేస్తుంది. పాత కోకకోలా సీసాలు, విరిగిన రేకు పట్టాల రంగుల వంటి వస్తువులు ఆమె పనిలో చోటు చేసుకుంటాయి. పెరుగుతున్న పట్ణణాల అభివృద్ధిలో ఇలాంటి వ్యర్థ వస్తువులూ పెరుగుతున్నాయి. వాతావరణానికి ముప్పూ తెస్తున్నాయి. ఈ అక్కరకు రాని పరిశ్రమల మలిన వస్తువుల వలన మన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతున్నది. కోకకోల బాటిల్స్‌తో తను చేసిన ఇన్‌స్టాలేషన్స్ ఆసక్తికరమైన వాక్యపూరణ చేశాయి. ఈ విదేశీద్రవ్యం ఎండకు దాహం ఇచ్చే పేపరుతో మన ఆరోగ్య, ఆర్థిక సంస్థపై చల్లగా ప్రబలి పక్షవాతం తెచ్చింది.
అంజుమ్ తల్లిదండ్రులు పేరున్న కళాకారులు. అర్పితాసింగ్, పరమ్‌జిత్‌సింగ్.. వీరంతా ఢిల్లీ వాస్తవ్యులు. 1967లో జన్మించిన అంజుమ్ చిన్నతనం నుండీ చిత్రకళని, కళా సిద్ధాంతాలను చూసింది. బి.ఎ. శాంతినికేతన్‌లోని కళాభవన్‌లో చదివి, ఆపై ఢిల్లీ ఆర్ట్ కాలేజ్‌లో ఎం.ఎ. 1991లో చదివింది. ఆపై 1994లో వాషింగ్టన్ డి.సి ఆర్ట్ కాలేజ్‌లో మళ్ళీ చదివింది. అక్కడ నుండి ఆమె కళలో ఎన్నో మార్పులు వచ్చినవి. ముందర ఫిగరేటివ్ పెయింటింగ్ చేస్తూ, తల్లి వలన ప్రభావితమైన ఆర్ట్ తయారు చేసే ఆమె, ఆపై ఆ సిద్ధాంతాలను అలవరచుకున్నా, ఎంతో ప్రయోగాత్మక కళలను తయారు చేసింది. చిత్రం పక్కనబెట్టి శిల్పం, ఇన్స్టాలేషన్లు చేసింది. పదార్థ వివరణ, వాటి విలువలు కూడా కళకు ఎంతో ముఖ్యం అనుకుంది. దేశ విదేశ ప్రదర్శనలిచ్చి ప్రతిభావంతురాలిలా నిల్చింది.
- డా||ఎం.బాలామణి,
81067 13356