Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క హెయిర్‌కట్‌కు ఎంతవుతుంది? మహా అయితే 50 రూపాయలు.. ఇంకా ఏసీ రూంలో కూర్చోబెట్టి చేస్తే రెండొందలు.. లేదా ఐదొందలు. కానీ రోడ్డు పక్కన కూర్చోబెట్టి ఓపెన్‌గా కటింగ్ చేస్తే ఒక్క కటింగ్‌కు 28వేలు వచ్చాయి. నమ్మడంలేదా? అయితే ఇది చదవండి.. నార్వేకు చెందిన హెరాల్డ్ బాల్డర్ దేశాలు తిరుగుతూ చిన్న చిన్న ట్రావెల్ వీడియోలు పోస్టుచేస్తూ, యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితులు. ఈ సారి అతను భారత్ పర్యటనకు వచ్చాడు. అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ బార్బర్ వద్దకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అదంతా తన యూట్యూబ్ చానెల్ కోసం అనుమతి తీసుకుని దాన్ని చిత్రీకరించాడు. అతని వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాడు. అతను కటింగ్ చేసినందుకు ఎక్కువ మొత్తం తీసుకుంటాడేమోనని భావించినా అతను 20 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. దాంతో ఆశ్చర్యపోయిన హెరాల్డ్ ఇదే అసలు నిజాయితీ. తాను ఎక్కువ మొత్తంలో ఆశిస్తే కోపం వచ్చేదేమో అని, వెంటనే అతని జేబులోని 400డాలర్లు (28వేలు) తీసి ఆ బార్బర్‌కు ఇచ్చాడు. నా ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తికి అదనంగా బహుమతి ఇచ్చాను అని మెచ్చుకున్నాడు. డబ్బుతో ఏదైనా పరికరం కొనుక్కో, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచించాడు. బార్బర్ మాత్రం ఓ కప్పుకాఫీ కొనిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అదేనండి నిజాయితీ మనలను ఎప్పుడూ ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అనడానికి ఇంతకన్నా ఏం కావాలి?
- పుప్పాల