Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేడా
టీచర్ : సీనియర్‌కి, జూనియర్‌కి తేడా ఏంటి?
స్టూడెంట్ : సముద్రానికి దగ్గరగా వుండేవాడు సీనియర్, జూకి దగ్గరగా వుండేవాడు జూనియర్
అబ్బా... ఆశ
భార్య: ఏమండీ.. ఎక్కడున్నారు.. (ఫోన్లో)
భర్త : మొన్న ఓ గోల్డ్ చైన్ బాగుందన్నావు కదా.. అప్పుడు నేను కూడా నీకు చాలా బాగుంటుందని చెప్పాను కదా..
భార్య : ఆ...ఆ... అక్కడున్నారా.. చైన్ తీసుకుంటున్నారా..
భర్త : లేదు లేదు.. ఆ ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపులో జిరాక్స్‌లు తీయించుకుంటున్నాను.
వాడిపోరాదని!
భర్త తెల్లారి లేస్తూనే.. గ్లాస్లో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు.. తుళ్ళిపడి లేచిన భార్య కోపంగా అరిచింది..
భార్య : క్రాక్ ఏమన్నా ఉందా నీకు.. నీళ్లు పోస్తావేంటి..?
భర్త : ఏం లేదు బంగారూ.. మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు.. నా కూతురు పువ్వులాంటిది.. వాడిపోకుండా చూస్కో అల్లుడూ అని. అందుకే..
సంతూర్... సంతూర్
చీమ : నీ వయసెంత
ఏనుగు : ఐదేళ్ళు
చీమ : ఐదేళ్ళేనా, మరి పెద్దగా కనిపిస్తున్నావేమిటి..?
ఏనుగు : నేను రోజూ కాంప్లాన్ తాగుతానులే. మరి నీ వయసెంత..?
చీమ : ముఫ్పై ఏళ్లు
ఏనుగు : ముఫ్పైయ్యా! ఇంకా.. చిన్న దానిలా కనిపిస్తున్నావ్?
చీమ : నేను సంతూర్ సబ్బు వాడుతానులే!
కనిపించడుగా
టీచర్ : ఏరు పండూ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పండు : వేశాను టీచర్
టీచర్ : ఎక్కడా..? కనిపించట్లేదు..?
పండు : దేవుడు ఎవరికీ కనిపించడు కదా టీచర్
సూపర్ సూక్తి
గంజి : ఉన్నోడి బట్టలకి, లేనోడి పొట్టకి.
భోజనం : లేనోడికి దొరికినప్పుడు, ఉన్నోడికి అరిగినప్పుడు
ఎలా వండాలి?
భర్త : భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య : కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
అదీ లేదు ఇదీ లేదు
భర్త : పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య : నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
జాగ్రత్తగా చూస్తున్నా
భార్య : ఏమండీ మాటిమాటికి లుంగివైపు చూస్తున్నారు ఎందుకు..?
భర్త : ఏం లేదే.. కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా అని పెళ్లిలో పంతులుగాలు చెప్పారు అందుకే..
ఎలాంటి చీరలు
షాప్ ఓనర్ : చెప్పండి మేడమ్.. ఎలాంటి చీరలు చూపించమంటారు.
సీత : మా పక్కింటావిడ దిమ్మ తిరిగేలాంటి చీరలు చూపించండి.
అసలు విషయం
రాము : పెళ్లి శుభాకాంక్షలు చెబితే కొట్టారు..
చందు : అంతలేదు కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు?
రాము : మీరు ఇలాంటి పెళ్లిళ్లు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నానంతే.
మంచి బిజినెస్
రాము : రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు
రమేష్ : వింటర్ సీజన్లో ఐస్ కొని.. సమ్మర్లో అమ్మితే మంచి లాభం వస్తుంది.