Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందంగానే వుంటుందనేది నానుడి. జుట్టుతో జడలు, కొప్పులేంటి ఏకంగా బొమ్మలే చేసింది పశ్చిమాఫ్రికాలోని ఐవోరియాకి చెందిన భామ లీటిటియాకి. పేపర్‌మీద పెన్సిల్‌తోనో, పెన్నుతోనో వేయడం ఎందుకనుకుందో ఏమో, ఏకంగా తన పొడవాటి నొక్కుల జుట్టుతో బొమ్మలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా తలమీది జుట్టు కత్తిరించి విడిగా తీసి అనుకుంటున్నారేమో. కానే కాదు.... తలమీది జుట్టుతోనే, తలమీదనే! రెక్కలు విప్పిన పక్షి, బల్బు, కుక్క ముఖం, ఖర్జూర చెట్టు, డాన్స్ చేస్తున్న జంట, సైకిల్, కప్పూ సాసర్ - జార్... ఇలా ఒక్కటేంటి తనకేది తోస్తే దాన్ని తన జుట్టుమీద ప్రయోగం చేసి ఓ ఆకారం తెస్తోంది. ఈ ఆకారాలు అలాగే వుండటానికి ఆ జుట్టులో సన్నటి వైర్, ఊలు, కొన్ని రకాల ఫాబ్రిక్స్ని ఉపయోగిస్తుంది. ఒక్కో బొమ్మ చేయడానికి ఇరవై నిమిషాల నుండి రెండు గంటల వరకు పడుతుందట. జుట్టుతో చేసిన ప్రతి ఆకారాన్ని ఓ ఫొటో తీసి పెట్టేస్తుంది ఇన్‌స్ట్రాగ్రామ్‌లో. ఈ ఫొటోలను చూసి ఈమెకి ఫాలోవర్లు పెరిగిపోతున్నారట. జిహ్వకో రుచి ఉన్నట్లే బుర్రకో ఇంట్రస్ట్ వుంటుందిగా మరి!