Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విభిన్న మనస్తత్వాల చిత్రణ
అసమర్థురాలి అంతరంగం, రజనీసుబ్రహ్మణ్యం, పేజీలు:120, వెల : 150/-,
ప్రతులకు : జ్యోతి వలబోజు, 8096310140
'అసమర్థుని జీవయాత్ర' అనే పేరుగల నవల తెలియని తెలుగు వారుండరు. దాని రచయిత జగమెరిగిన గోపీచంద్‌గారు. ఆయన కూతురు రజనీ సుబ్రహ్మణ్యం దాదాపుగా అదే పేరు 'అసమర్థురాలి అంతరంగం' పేరిట తానో పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో రచయిత్రి పది కథలు, మూడు అనువాదాలు, ఏడు వ్యాసాల్ని సంపుటీకరించారు. 'కూు చుక్ చుక్' కథలో జాజి పాత్ర తన రైలు ప్రయాణంలోని పదనిసల్ని అంటే విభిన్న మనస్తత్వాల మనుషుల్ని ఆమె ఎలా భరించగలిగిందీ తెలియవస్తుంది. రెండో కథలో వేణు, దేవికలు భార్యాభర్తలు. అతడు మంచివాడే, కానీ పురుషాధిక్యత అనేది కాస్త వుంది. ఆమె ఓ శుభకార్యానికి వెళ్ళే సమయంలో అన్నయ్య ఇచ్చిన చీర కడితే, ఆ పురుష పుంగవుడికి తాను తెచ్చిన చీరనే కట్టుకోవలసిందిగా ఆదేశమిస్తాడు. ఆమె మారు మాట్లాడక అతను చెప్పినట్లే చేసి 'ఓటమి' అంగీకరిస్తుంది. ఏడో కథ 'గెలుపు'. ఇది 'ఓటమి' కథకు కొనసాగింపు. మూడు అనువాదాలు కూడా రచయిత్రి అనువాదం చేసినట్లు కాక, అందులో లీనమై రాసినట్లున్నాయి.
- కె.హరనాథ్,
9703542598
సాంస్కృతికోద్యమ 'మహాబాటసారి'
మహాబాటసారి, రచన : కె.శాంతారావు, పేజీలు : 110, వెల : 40, ప్రతులకు : కె.శాంతారావు, 103, ఆదిత్య ఆర్కెడ, బి.బ్లాక్, అజామాబాద్, హైదరాబాద్ - 20. సెల్ : 9959745723
ఈ సంపుటికి టైటిల్‌గా పెట్టిన 'మహాబాటసారి' (పేజీ.50) కవితలో ఒక చోట ఇలా రాశారు ''కుల మత భాషా ప్రాంతాలకు/ అతీతంగా అతని శిరసుస ఇప్పుడు/ ఆకాశాన పతాకమవుతున్నది/ జాతులు దేశాలు ఖండాలు దాటుకుని/ అతని పాదహృదయం/ రవి కిరణమవుతున్నది'' అంటారు. ఏ కవికైనా అంతర్జాతీయ, దృక్పథం, వర్గస్పృహ వుండాలి. ప్రపంచంలోని పరిస్థితులను బూర్జువా మేథావులు పరిపరి విధాల వర్ణిస్తారు. విప్లవ కవులు పరిస్థితుల్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం గమ్యం వైపు పయనిస్తే మహా బాటసారి గమనం - సార్థకమవుతుంది. కవికి స్పష్టత వుంది. ఆచరణ వాదం - కర్తవ్య పథం, నిరాడంబరత - సామాజిక బాధ్యతలు ప్రతి కవితలో కనిపిస్తాయి. రేపటి కర్తవ్య పథం సూచిస్తాయి. కవి శాంతారావు అభినందనీయులు.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
మొదటి చీమ, రామా చంద్రమౌళి
పేజీలు :110, వెల:80/-
ప్రొ||రామాచంద్రమౌళి, 11-24-498, టెలిఫోన్ భవన్ లైన్, పోచమ్మ మైదాన్, వరంగల్ - 506002
దూదిపింజలు (నవల)
సలీం
పేజీలు : 184
వెల : 150/-
ప్రతులకు : జ్యోతి వలబోజు
సెల్ : 8096310140
ప్రముఖ పుస్తక కేంద్రాలు
శ్రీకారం
సంపాదకులు : వజ్రనాభ్ నటరాజ్ మహర్షి
పేజీలు : 196
వెల : 500/-
ప్రతులకు : 917715984574
ప్రముఖ పుస్తక కేంద్రాలు
తపతీ సంవతరణము
అద్దంకి గంగాధరకవి ప్రణీతము
పరిష్కర్త : డా||పాటిబండ మాధవశర్మ
పేజీలు : 182, వెల : 80/-
ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమీ
రచయితలు... ప్రచురణ కర్తలు విధిగా పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యాలు, సేకరణ, కూర్పు, సంకలనం : చలపాక ప్రకాష్, పేజీలు : 16, వెల : 10, ప్రతులకు : రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్, పి.బి.నెం.5, డోర్నె:11-57-1-32, కె.ఆర్.కాంప్లెక్స్, 2వ ఫ్లోర్, రజకస్ట్రీట్. సెల్ : 924745975