Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచనాత్మకంగా
'త్యాగమూర్తులంటూ' కవర్‌స్టోరీ చాలా ఆలోచనాత్మకంగా ఉంది. ఉద్యమ నేపథ్యం, వర్తమానపరిస్తితులు, మన కర్తవ్యం వివరంగా, స్పష్టంగా చెప్పారు. అభినందనలు.
- యం.ఎ.కె.దత్, హైదరాబాద్
కమర్షియల్‌గా మారింది
ఈ వారం 'త్యాగమూర్తులంటూ' కవర్‌స్టోరీ నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకోడానికి యువతకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మహిళా దినోత్సవాన్ని ఎంత కమర్షియల్ చేస్తున్నారో కూడా చక్కగా వివరించారు. వందేళ్ళు దాటినా పనిచేసే ప్రదేశాల్లో మహిళల పరిస్థితి ఏమీ మారలేదు.
- కుమార పంగలన్, ఎం.ప్రమోద్ కుమార్; హైదరాబాద్
కథ ఆకట్టుకుంది
'త్యాగమూర్తులంటూ' కవర్ స్టోరీ బాగుంది. 'చర్నాకోల' కార్టూన్లు నవ్విస్తున్నాయి. 'ఫేస్బుక్ కబుర్లు'లో కోడిపుంజుపై కేసు చదివి ఆశ్చర్యపోయా. చింటపట్ల సుదర్శన్ 'మూడక్షరాలు' బాగుంది. బుర్రా లక్ష్మీనారాయణ కథ 'సిరిచూపు' కథ ఆకట్టుకుంది.
- గుండు రమణయ్య, పెద్దాపూర్ (పెద్దపల్లి)
వాదనకు బలం
'ఇంపైన మాటలు చెప్పే వారిని అట్టే నమ్మొద్దు. వారి మాటలకీ, చేతలకీ నడుమ అంతరాలున్నదీ లేనిదీ తెలుసుకోవడం ముఖ్యం' అన్న అంతరంగం సూచన నచ్చింది. ఎన్నో దృష్టాంతారాలు దీనికి మద్దతుగా చూపించడం వలన వాదనకు బలం చేకూరింది. ఓటరు విలువను చౌరస్తా గొప్పగా చూపింది. ఎన్నికలప్పుడు ఎలా వున్నావు అన్నవారు ఎన్నికైన తరువాత ఎవరు నువ్వు అనే దుర్దినాలకు అంతిమ సంస్కారం జరుగుతుంది. కవర్‌స్టోరీ చాలా ప్రశ్నలు లేవనెత్తినది. సుదీర్ఘ చరిత్ర కనుల ముందు పరిచింది. మహిళా దినోత్సవం ఒక తంతుగా కాక సీరియస్ విషయంగా తీసుకున్న నాడు ఆశించిన ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. స్త్రీకి విద్య, ఉద్యోగం, సమానత్వానికి సంబంధించిన అవకాశాలు ఇంట్లో నుండే మొదలవ్వాలి.
- పంజాల నరసయ్య, హైదరాబాద్
నిడివి తగ్గిస్తే...
మార్చ్ 3 సోపతి లో వచ్చిన 'త్యాగమూర్తులంటూ' వ్యాసంలో సమాచారం బాగుంది. కానీ నిడివి తగ్గించి వర్తమాన అంశాల ప్రస్తావన తగ్గడంతో ఆత్మ లోపించినట్లు అనిపించింది.
- జె వెంకటేశ్, హైదరాబాద్
శబరిమలై విషయం కూడా
'త్యాగమూర్తులంటూ' వ్యాసం వివరణాత్మకంగా ఉంది. కాని దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిన శబరిమలైలో మహిళల ప్రవేశంపై కేరళలో లక్షలాది మహిళలతో జరిగిన పోరాటం గురించి కూడా చేర్చి ఉంటే మరింత సమగ్రంగా ఉండేది.
- స్వరూపరాణి, విజయవాడ