Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీచర్ స్కూలు పిల్లలను ఎందుకు హోంవర్క్ చేయలేదని అడిగితే జ్వరం వచ్చిందనో లేదా ఇతర ఏదైనా కారణం చెబుతారు. అయితే ఓ బుడతడు మాత్రం టీచర్‌కు దిమ్మదిరిగే సమాధానం రాసిచ్చాడు. ఇప్పుడు ఆ లేఖ వైరల్ అయింది. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్ ఆమ్మాన్యుయేల్ వీకెండ్లో తన టీచర్ ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లిన అతనికి హోంవర్క్ ఎందుకుచేయలేదో చెప్పాలంటూ టీచర్ నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. ఎందుకు హోం వర్క్ చేయలేదో రాసివ్వాలని ఆ టీచర్ ఆదేశించింది. 'నేను హోంవర్క్ ఎందుకు చేయలేదంటే వీకెండ్లో స్కూల్ వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వీకెండ్ ఉండేది స్ట్రెస్ లేకుండా స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయడానికి, టీవీ చూడడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, నాకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేస్తా. అంటూ ఎలాంటి బెరుకూ లేకుండా తనకు తోచింది రాశాడు. హోంవర్క్ అనేది ఉపయోగం లేదు కాబట్టి స్టూడెంట్ వర్సెస్ హోంవర్క్ కేసులో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ వాదనకు కోర్టు మద్దతుగా నిలిచింది. ఇక కేసు క్లోజ్ అయింది. అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆ బుడతడు ఇచ్చిన సమాధానం చూసి ఆ టీచర్ షాక్ అయింది. ఒక రకంగా కోర్టుతీర్పులా తనే ఓ తీర్పు ఇవ్వడంతో నెట్‌జన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. ఏదేమైనా ఈ కాలం పిల్లలను ఏమీ అనేట్టు లేదని పేరెంట్స్, టీచర్లు గమ్మునుంటున్నారు.
- పుప్పాల