Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మబ్బులు కమ్మిన ఆకాశంవైపు చూపు సారించినప్పుడు ఒక్కోసారి వింత ఆకారాలు మనకు కనిపిస్తాయి. ఆకాశానికి పెద్ద పెద్ద చిల్లులు పడినట్లు కానీ, విమానం ఆకారం కానీ, గుండ్రని పళ్లెంలాగా కానీ కనిపించినప్పుడు ఏమిటబ్బా ఇవి అనే అనుమానం వస్తుంది. వీటిని చూసే కొందరు గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెములు (ఫ్లయింగ్ సాసర్స్)గా చాలామంది భ్రమపడుతూ ఉంటారు. నిజానికి అవి ఫ్ల్రయింగ్ సాసర్స్ కావు. వర్షాన్నిచ్చే మబ్బులకు పడిన రంధ్రాలు.
మబ్బులకు రంధ్రాలు పడటమేంటి అనుకుంటున్నారు కదూ. నిజంగానే మబ్బులకు రంధ్రాలు పడతాయి. మేఘాల్లోని నీటి ఉష్ణోగ్రత నీరు గడ్డకట్టగలిగిన ఉస్ణోగ్రతకన్నా దిగువకు పపడిపోయిన స్థితిలో విమానాలు ఆ మేఘాల గుండా ప్రయాణించినప్పుడు ఈ రంధ్రాలు పడతాయి. వాతావరణం అనుకూలించి మేఘం వర్షించేవరకు ఆ రంధ్రాలు కనిపిస్తూనే ఉంటాయి. మబ్బుల్లో కనిపించే ఈ రంధ్రాలను చూసి ఒక్కోసారి గ్రహాంతరవాసులు ప్రయాణించే ఫ్లైయింగ్ సాసర్లుగా కొందరు భ్రమపడుతూ ఉంటారు.