Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలంలో ఎండలు మండుతుండటంతో పనుల మీద బయటకు వెళ్లే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదముంది. ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త ఉండొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఎండలో ఎక్కువ సేపు తిరగొద్దు
- నీరు, శీతలపానీయాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా వుంటుంది. రోజుకు దాదాపు 5 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.
- కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిది.
- వేసవి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోవద్దు
- వీలైనంత వరకు మధ్యాహ్న సమయాల్లో పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఉదయం సాయంత్రం వేళలల్లో పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
- ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారు మధ్య మధ్యలో నీడలో కూర్చొని అలసట తీర్చుకోడం వల్ల శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకోవచ్చు.
వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి.
- ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసుకోవాలి. వీలైనంతా తొందరగా శరీరాన్ని చల్లబర్చాలి.
- కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నీళ్లు వంటివి తాగించాలి
- అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి
వేసవిలో చర్మ సంరక్షణ కోసం :
వేసవి వచ్చిందంటే చాలా మంది ఎండ నుంచి ఏవిధంగా చర్మాన్ని రక్షించుకోవాలని బయపడిపోతుంటారు. ముఖ్యంగా యువతులు తమ చర్మ సౌందర్యాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వారు చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్...
బ చర్మాన్ని సంరక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడాలి. రోజూ రెండు సార్లు ఈ సన్‌స్క్రీన్‌లోషన్ వాడకం మూలంగా చర్మం నిగనిగలాడుతుంది.
- అలాగే నీళ్లు ఎంత తాగితే శరీరం అంత తేమగా తయారయ్యి మెరిసిపోతుంది.
- ఎండాకాలం నుంచి చర్మాన్ని సంరక్షించే మరొక మార్గం పండ్లు. ఇవి ఎంత ఎక్కువ తింటే శరీరం అంత ఆరోగ్యంగాను, చర్మం స్మూత్గానూ తయారవుతుంది.
- ఎండలో వెళ్లేటప్పుడు కండ్లకు గ్లాస్‌ను వాడటం వల్ల కండ్లకు ఎండ నుంచి రక్షించుకోవచ్చు.
- కాటన్ దుస్తులు దరించడం వల్ల శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోచ్చు.
- రాజమొని శివలీల సావిత్రి