Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందికి ఏ కొంచెం వాసన వచ్చినా వెంటనే పట్టేస్తారు. మరికొందరు అంతగా పసికట్టలేరు. వాసనను బాగా పసిగట్టగలవారి కంటే వాసనను గుర్తించలేని వృద్ధులు త్వరగా మరణిస్తారని అధ్యయనాలు రుజువుచేశాయి. 29 ఏప్రిల్ 'ఏనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్ సంచికలో ఈ అధ్యయనానికి సంబంధించిన విశేషాలు ప్రచురితమయ్యాయి. 1997-1998 మధ్య కాలంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో నివసిస్తున్న 70-79 ఏండ్ల వయసున్నవారిని 3000 మందిని అధ్యయనం కోసం ఎన్నుకున్నారు సైంటిస్టులు. ఇందులో 2300 మందిని అధ్యయనం ప్రాంరంభంలోనే సాధారణంగా ఉండే 12 వాసనలను చూపించి వాటిని గుర్తించమని అడిగారు. ఆ తర్వాత వారు మరణించేవరకు లేదా 2014 (ఏది ముందయితే అది) వరకు ఈ అధ్యయనంలో వారిని భాగస్వాములుగా కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం 13 ఏండ్ల అధ్యయన కాలంలో 1200 వంది అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులు మరణించారు. వాసన టెస్ట్‌లో తక్కువ మార్కులు పొందినవారిలో నలభై ఆరు శాతం మంది పదేండ్లలోనే చనిపోయారు. 30 శాతం మంది 13 ఏండ్లలో చనిపోయారు. వాసనను గుర్తించినవారు, గుర్తించనివారు అనే అంశంతో సంబంధం లేకుండా వృద్ధాప్యం వల్ల 13 ఏండ్లలో అందరూ చనిపోయారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తం మీద మంచి ఆరోగ్యంగా ఉన్నవారికి వాసన గ్రహించే శక్తి సన్నగిల్లుతున్నదంటే అర్థం వారు మరణానికి చేరువవుతున్నారని అర్థమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.