Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు మార్కెట్లోకి మొబైల్స్ ప్రియుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని బెస్ట్ మొబైల్స్ అంటూ అనేక కొత్త కొత్త మొబైల్ కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నా క్వాలీటీలో మాత్రం డొల్ల అని నిరూపించుకుంటున్నాయి. ఇలాంటి మొబైల్ వాడకం మూలంగా అధిక రేడియేషన్ ఉత్పత్తి అవుతోంది. ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
మొబైల్ రేడియేషన్ ప్రమాదాలు ...
- మొబైల్ వాడకంతో ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, నిద్రలేమి వంటివి వస్తాయి.
- వీటి రేడియేషన్ మూలంగా కంటి క్యాన్సర్, నోటి క్యాన్సర్ అవకాశాలున్నాయి.
- ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి పోతుంది.
- పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం వుంది.
- మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించే మహిళల్లో అబార్షన్లయ్యే ప్రమాదముంది.
- మతిమరుపు, స్కిన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశమూ వుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అధిక రేడియేషన్ ఉన్న ఫోన్లను వాడొద్దు.
- గంటల తరబడి మొబైల్‌ను చెవిదగ్గర పెట్టుకోవద్దు.. అవసరమైతే లౌడ్ స్పీకర్‌ను పెట్టుకోవాలి
- మొబైల్‌ను బ్యాగులో వేసుకోవాలి. షర్ట్ ప్యాకెట్లో వేసుకోకూడదు.
- ముఖ్యంగా మొబైల్ రేడియేషన్ పిల్లలపై బాగా పడుతుంది. కాబట్టి వీలైనంత వరకూ మొబైల్స్‌ను వారికి దూరంగా ఉంచాలి. ఇచ్చినా తక్కువగా ఇవ్వాలి.
- మొబైల్‌ను పక్కన పెట్టుకుని పడుకోకూడదు.
- చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వాడకం పూర్తిగా తగ్గించాలి. ఎందుకంటే మిగతా సమయాల్లో కంటే అప్పుడు అధిక రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది.
- రేడియేషన్‌ను తగ్గించడానికి మొబైల్ వెనకాల వేసే యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు వాడకం వల్ల కొంత వరకు రేడియేషన్‌ను తగ్గించవచ్చు.