Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.వి.ఆర్. సంక్షిప్త జీవిత చరిత్ర
మా జ్ఞాపకాల్లో కె.వి.ఆర్, వకుళాభరణం లలిత, రామకృష్ణ, కె.వి.ఆర్.శారదాంబ స్మారక కమిటీ, పేజీలు : 93, వెల : 80/-, ప్రతులకు : 9849083137
కె.వి.ఆర్. మార్క్సిస్టు మేధావి. విమర్శకుడు. ఆయన తెలుగు ఆధునిక, అభ్యుదయ, విప్లవ సాహిత్యాల్లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సాహిత్యంలోని ప్రతి ప్రక్రియనూ స్వంతం చేసుకున్నారు. వివాదాలు, విమర్శలను ఎదుర్కొన్నారు. వకుళాభరణం దంపతులు కె.వి.ఆర్.తో గల చిరకాల స్నేహబంధాన్ని పురస్కరించుకుని వారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఇందులో నమోదు చేశారు. వారి బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, అరసం - విరసంలతో వున్న అనుబంధం, ఆయన ఎదుర్కొన్న కేసులు - నిర్బంధాలు చివరగా ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేశారు. దీనికి అనుబంధంగా కె.వి.ఆర్. పుస్తకాలకు వకుళాభరణం రామకృష్ణ రాసిన ముందుమాటలను కూడా జత చేశారు.
- కె.పి.అశోక్‌కుమార్, 9700000948
గుల్జార్ కవితలకు అందమైన అనువాదం
గుల్జార్ ఆకుపచ్చ కవితలు, అనువాదం: వారాల ఆనంద్, పేజీలు: 160, వెల: రూ. 125
ప్రతులకు: అనువాదకుని సెల్: 94405 01281
ప్రకృతిలోని సౌందర్యాన్ని, మానవ జీవితంలోని వైవిధ్యాన్ని అపురూపంగా అభివ్యక్తం చేసిన కవితల సమాహారం 'ఆకుపచ్చ కవితలు'. గుల్జార్ రాసిన 'గ్రీన్ పొయెమ్స్'కు వారాల ఆనంద్ చేసిన అనువాదం ఈ పుస్తకం. నాలుగు దశాబ్దాల కిందటనే గుల్జార్‌తో ఆనంద్‌కు పరిచయమైంది. సినిమా ప్రేమికుడు, సాహిత్య ప్రేమికుడయిన ఆనంద్ మంచి కవి, రచయిత. అందుకే ఎంతో ఇష్టంగా గుల్జార్ కవిత్వాన్ని అనువాదం చేశారు. సున్నితమైన అభివ్యక్తితో కూడిన ఈ కవితలు మరల మరల చదివిస్తూ పరవశానికి లోను చేస్తాయి. హిందీ కవితల్ని ఒక పక్కన, మరో పక్కన తెలుగు కవితలు ఇచ్చారు ఈ పుస్తకంలో. మూలానికి తగినట్టుగా ఉన్న ఈ అనువాదంలో అందం ఉంది. చక్కటి తెలుగు పదజాలంతో అనుసృజించిన ఈ కవితలు చదివితే గుల్జార్ కవిత్వం మీద, పాటల మీద ప్రేమ ఇనుమడిస్తుంది. వారాల ఆనంద్ అనువాద సాఫల్యానికి నిదర్శనంగా నిలిచిపోయే పుస్తకమిది.
కథల మీద ప్రేమని పెంచే పుస్తకం
రష్యన్ జానపద కథలు, స్వేచ్ఛానువాదం: అనిల్ బత్తుల
పేజీలు: 80, వెల: రూ. 100, ప్రతులకు: తెలుగు రీడర్స్ క్లబ్, 96763 65115
అనిల్ బత్తుల అనువాదం చేసిన రష్యన్ జానపద కథలు చదివితే కథల మీద ప్రేమ పెరుగుతుంది. పిల్లలకు కథల పట్ల ఆసక్తి కలుగుతుంది. చిన్న చిన్న వాక్యాలతో, తేలికయిన పదాలతో కూడిన ఈ కథలు చదవడం చక్కటి అనుభవం. పిల్లల్ని దగ్గర కూర్చొపెట్టుకుని ఈ కథలు చదివి వినిపించడం మంచిది. అలాగే పిల్లలు చదువుతుంటే అమ్మానాయినలు వినడం ఇంకా బాగుంటుంది. పిల్లలకు తెలుగు మీద ప్రేమనీ, కథల మీద ఆసక్తినీ ప్రోది చేసే శక్తి ఉన్న ఈ పుస్తకంలో ఇరవై కథలున్నాయి. చక్కగా, అందంగా బొమ్మలతో కూడిన ఈ పుస్తకాన్ని పిల్లలకు బర్త్‌డే బహుమతిగా అందిస్తే బాగుంటుంది.
- వికర్ణుడు
అర్థశాస్త్ర క్రమ పరిణామం
మార్క్స్ పూర్వపు అర్థశాస్త్రం
ఎ.వి.అనీకిన్
పేజీలు : 450
వెల : 290/-
ప్రతులకు : నవచేతన, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ పుస్తక కేంద్రాలు
జాబిలి ఖైదు
ఇక్బాల్
పేజీలు : 136
వెల : 100/-
ప్రతులకు : ఇక్బాల్, ఇక్బాల్ మంజిల్, ఇ.నెం.6-29, జి.వి.ఎన్క్లేవ్, గవర్నమెంట్ స్కూల్ పక్కన, గద్వాల్
ఫోన్ : 9440775732
డిసెంబర్ ఆరు కథ (1993-94)
సంకలనం:పరుచూరి సుబ్బయ్య
పేజీలు : 96, వెల : 30/-
ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు
భూమి
మరికొన్ని కథలు 1994
సంకలనం:
పరుచూరి సుబ్బయ్య
పేజీలు : 96,
వెల : 30/-
ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు
వికట యోగము
(ప్రబంధము)
కవి తిలకం డాక్టర్ పిట్టా సత్యనారాయణ
పేజీలు : 60
వెల : 80/-
ప్రతులకు : పి.విజయలక్ష్మి, ఇం.నెం.24-7-199/1/1, ఎన్.ఐ.టి.వద్ద, హనుమకొండ - 506004