Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత లోతైన ప్రాంతాల్లో కాఫిన్ ఫిష్ (చౌనాక్స్ ఎండీవర్) అని పిలిచే చేప నీటిని లోపలికి తీసుకుని దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉగ్గబట్టి అట్లానే ఉండిపోతుందట. చేపలు నీటిని లోపలికి తీసుకోవడం అంటే ఊపిరి పీల్చుకున్నట్లన్నమాట. చేపలు తమ నోటి ద్వారా నీటిని లోపలికి తీసుకుని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని గ్రహించి, కేవలం హైడ్రోజన్ ఉన్న నీటిని తమ మొప్పల ద్వారా బయటికి వదులుతాయి. అయితే ఈ కాఫిన్ పిష్ మాత్రం తమ విశాలమైన మొప్పల గదుల్లో నీటిని 26 సెకండ్ల నుంచి నాలుగు నిమిషాల సమయం వరకు పట్టి ఉంచుతాయని ఇటీవల పరిశోధనల్లో బయటపడింది. జర్నల్ ఆఫ్ ఫిష్ బయాలజీ 10 మే సంచికలో ఈ విశేషాలు ప్రచురితమయ్యాయి. ఎనిమిది కాఫిన్ చేపలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవి నీటిని మొప్పల గదుల్లో కొంత సేపు బంధిస్తాయని ఆ సమయంలో ఆ చేపల పరిమాణం సుమారు ముప్పై శాతం పెద్దదిగా కనిపిస్తుందని గుర్తించారు. ఈ చేపలు ఇట్లా ఎందుకు చేస్తున్నాయనే విషయంలో శాస్త్రవేత్తలు కొన్ని ఊహలకు ఊపిరిపోస్తున్నారు. తమకన్నా పెద్ద జంతువులు తమను అమాంతం మింగి వేయకుండా తమను తాము పరిమాణంలో పెద్దవిగా కనిపించేలా చేయడం కోసం ఇలా చేస్తూ ఉండవచ్చని సైంటిస్టులు ఊహిస్తున్నారు.