Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు నిగనిగలాడుతూ, నల్లగా పట్టుకుచ్చులా వుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ప్రపంచంలోని అందరి జుట్టూ నల్లగా వుండదు. కొందరి జుట్ట్టు తెల్లగా, మరికొందరి జుట్టు రాగి వర్ణంలో, ఇంకొందరి జుట్టు బంగారు రంగులో వుంటుంది. ఉష్ణప్రాంతం అంటే... వేడి ఎక్కువగా వున్న ప్రాంతాల్లో నివశించేవారి జట్టు సాధారణంగా నల్లగా వుంటుంది. ఎందుకంటే నల్లగా వుండే వస్తువులు వేడిని బాగా గ్రహించడమే కాక, సులభంగా వదిలేస్తాయి కూడా. ఈ ఏర్పాటు వేడి ప్రాంతాల్లో జీవించేవారికి ఎంతో ఉపయోగంగా వుంటుంది. అసలు వెంట్రుకలు నల్లగా వుండటానికి కారణం కెరటిన్ అనే పదార్థం. కెరొటిన్ తక్కువగా వున్న వారి జుట్టు రాగి రంగులోనో, తెల్లగానో వుంటుంది. వృద్ధులకు కెరొటిన్ పదార్థం తక్కువైపోవడంవల్ల వారి జుట్టు తెల్లబడుతంది. అయితే నేడు కొందరికి వృద్ధాప్యం రాకముందే వివిధ కారణాల వల్ల కెరొటిన్ పదార్థం తగ్గడం వల్ల చిన్నతనంలోనే జుట్టు తెల్లగా మారుతుంది. ఇదేమీ వ్యాధికాదు, కేవలం మన శరీరంలో కెరొటిన్ అనే రసాయనం తగ్గడం మూలానే నలుపు జుట్టు రంగు మారి రాగిరంగులోకో, తెల్లగానో వుంటుంది.