Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇతివృత్త వైవిధ్యం ఈ కథల బలం
ఒక సాయంత్రం ఇల్లు చేరినప్పుడు- పలమనేరు బాలాజీ, పేజీలు: 160, వెల: రూ. 100, ప్రతులకు: గండికోట వారిజ, పలమనేరు, ఫోను: 94409 95010
మానవ సంబంధాల్లోని సంక్లిష్టతల్ని ఆర్ద్రమైన రీతిలో కథలుగా చెప్పే రచయిత పలమనేరు బాలాజీ. కవిగా, కథా రచయితగా ప్రసిద్ధి చెందిన ఈయన తాజా కథల సంపుటి 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు'. ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. గ్రామీణ, పట్టణ జీవితాల్లోని విభిన్న పార్శ్వాలకు సంబంధించిన ఇతివృత్తాలు వీటిలో ఉన్నాయి. ఆయా పాత్రల 'సూపర్‌మార్కెట్, మంచిరోజులు, ఖాళీ కప్పులు, వీళ్ళెవరో మీకు తెలుసా?' కథలు మరల మరల చదవాలి. అత్యాధునిక జీవన సందర్భాలు మనిషిని స్థిమితం లేకుండా చేస్తున్న వైనం ఈ కథలు చదివితే బోధపడుతుంది. ఇతివృత్తాల్ని ఎంచుకునే పద్ధతి, వాటిని తగిన నిర్మాణంతో చిత్రించే సంవిధానం కారణంగా ఈ కథలు చదివించే గుణాన్ని సంతరించుకున్నాయి.
సహజయానం ఈ కవిత్వ ప్రత్యేకత
చర్యాపదాలు- అనువాదం: ముకుందరామారావు, పేజీలు: 160, వెల: రూ. 99, ప్రతులకు: ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సంస్కృతి సమితి, అమరావతి
మహాయాన బౌద్ధుల నిర్వాణగీతాలను 'చర్యాపదాలు' శీర్షికన ముకుందరామారావు అనువాదం చేసి అందించారు. మహాయాన బౌద్ధం, సహజయాన బౌద్ధంగా పరిణమించే క్రమాన రూపుదిద్దుకున్న గీతాలు ఇవి. గీతాలు అన్నారే గాని చక్కటి, చిక్కటి వచన కవితలు ఇవి. మహాయాన, హీనయానాలతో పోలిస్తే సహజయానం మేలయినది, ఆచరణీయమైంది. ఈ కవిత్వమే ఇందుకు ఉదాహరణ. బౌద్ధం ప్రభావంతో వెలువడిన ఈ తరహా కవిత్వాన్ని మొదటిసారిగా ముకుందరామారావు తెలుగువారికి అందిస్తున్నారు. ఈ అనువాదం కోసం వారు తీసుకున్న శ్రమ సఫలమైంది. విభిన్నమైన కవిత్వం చదవాలని తపించేవారి దాహార్తిని తీర్చే పుస్తకమిది.
ముస్లింయోధుల పరిచయగాథలు
స్వాతంత్య్ర సమరంలో ముస్లింయోధులు- హీరాలాల్మోరియా, సంపాదకుడు: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీలు: 56, వెల: రూ. 40, ప్రతులకు: తెలంగాణ ప్రచురణలు, ఫోను: 98856 82572
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లింలు చేసిన మహత్తర పోరాటాన్ని, అందులోని కొందరి యోధానుయోధుల్ని పరిచయం చేస్తూ హీరాలాల్ మోరియా రాసిన వ్యాసాల సమాహారం 'స్వాతంత్య్ర సమరంలో ముస్లిం యోధులు'. కథకునిగా తెలిసిన మోరియా రాసిన ఈ వ్యాసాలని ఈతరం వారికి తెలియజెప్పేందుకు తెలంగాణ ప్రచురణలవారు పుస్తకంగా తీసుకొచ్చారు. దేశంలో ముస్లిం వ్యతిరేకత ప్రబలిన ప్రస్తుత నేపథ్యంలో వారి త్యాగాల గురించి గుర్తు చేసుకోవాలి. అందుకే ఉపకరించే పుస్తకమిది.
- కిరణ్‌కుమార్
రామచిలుక (బాలలగేయాలు)
చెరుకు శశిరేఖ
పేజీలు : 100, వెల:100/-
ప్రతులకు : చెరుకు శశిరేఖ
శ్రీమిత్ర రమణ క్లాసిక్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెం.103, స్ట్రీట్‌నెం.3, చైతన్య స్కూల్ దగ్గర. తార్నాక, సికింద్రాబాద్
భారత బడా బూర్జువా వర్గం
సునీతి కుమార్ ఘోష్
తెలుగు : ఎస్.ఆశాలత
పేజీలు :454, వెల : 200/-
ప్రతులకు : డి.వి. రామకృష్ణారావు, ఎం.ఐ.జి-14, ఎ.సి.ఐ.ఐ.సి. కాలనీ, కార్బైడ్ కంపెనీ ఎదురుగా, మౌలాలి, హైదరాబాద్ - 40
పద్యాలయము
సంపాదకులు : ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పేజీలు : 140, వెల :125/-
ప్రతులకు : నవోదయ, విశాలాంద్ర పుస్తక కేంద్రాలు
చంద్రవంక
(అరుణతార కథలు)
సంకలనం : పరుచూరి సుబ్బయ్య
పేజీలు : 96
వెల : 30/-
ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు