Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదలను సుడులు తిప్పే 'దేహనది'
దేహనది (కథలు), రచన : బుర్రా లక్ష్మీనారాయణ, పేజీలు:152, వెల:100/-, ప్రతులకు : రచయిత, 2-2-647-235-18-ఎ, జాంజాం మసీదు ఎదురుగా, బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్ - 13.
కవితాత్మకమైన శైలితో కథలు రాసిన బుర్రా లక్ష్మీనారాయణ 'దేహనది' పేరిట ఒక కథా సంపుటి వెలువరించారు. ఇందులో 18 కథలున్నాయి. ఈ అన్ని కథల్లోనూ మధ్య తరగతికి చెందిన మనుషులందరూ వున్నారు. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవడం, వాటిని ఎలా ఎదుర్కోవాలో, గెలపోటములు ఎటునుంచి ఎటు వస్తాయో తెలియకుండా తల్లడిల్లే వర్గం ఈ కథల్లో తారసపడతాయి. వివిధ రకాలైన మానవ స్వభావాలు ఈ పాత్రల ద్వారా మనకు తెలియవచ్చి, ఒక్కోసారి మనమే ఆ పాత్రల్లో ఉన్నామా అనిపించే విధంగా వుంటాయి.
లక్ష్మీనారాయణ గారి శైలి చైతన్య స్రవంతిని పోలి వుంటుంది. అన్ని సంఘటనలూ మన కళ్ళముందే కదలాడుతున్నట్లు వుంటాయి. వాటిలో పాఠకుడుంటాడు. ఆ పాఠకుడిని తనతో పాటు తరుముకుంటూ తీసుకుపోతుంటాడు రచయిత. ఎన్నో ప్రపంచాల్ని చూపించగల నేర్పు, వాటి నుండి బయట పడేందుకు లక్ష్యాన్ని చేరుకోగలిగే తహతహలు సృజించి, మనిషేమిటో తాను కోల్పోయిందేమిటో, అది దొరకబుచ్చుకునేదెట్లాగో, సమస్యలకు పరిష్కారమెట్లాగో మార్చి, ఏమార్చి పాఠకుడి మనసుని జతపర్చి, సరిచేసి, విరిచేసి, గురి చూసి, జత చేసి, దరిజేర్చి చూపగల నైపుణ్యం ఈ కథల్లో పుష్కలంగా వుంది. లక్ష్మీనారాయణగారి కథారచనా విధానం, శైలి ప్రత్యేకమైంది.
- కె.హరనాథ్, 9703542598
విభిన్న కథల సమాహారం
'అమ్మ అజ్ఞానం' రాసింది గుండు సుబ్రహణ్య దీక్షితులు. మొత్తం 32 కథల్లో ఏ రెండు కథలూ పోలి వుండనివి. దేనికదే విభిన్నమైనవి. రకరకాల అంశాలూ, వేర్వేరు రసాలూ! ఏకమొత్తంగా చదివినందుకు తద్వారా రసాస్వాదనే గాక జ్ఞాన సముపార్జన చేసిన సంతృప్తి పఠితలకు దక్కుట ఖాయం.
చిన్నగా చిక్కగా వున్న కథల్లో దేశమంతటినీ సాక్షాత్కరింప చేయటం అనన్యసామాన్యం. ఒక్కో కథను విడిగా సమీక్షించదగిన స్థాయి కద్దు. 'అమ్మ అజ్ఞానం, తీరిన తాతగారి అప్పు, ఆ కథ చెప్పాలిగా' కథలు అతి సున్నితంగా మనసు మూలల్నీ, మేధస్సు మూలాల్నీ స్పృశించే తీరు మానవాళికి ఆదర్శప్రాయం. పీడిత సహానుభూతి వున్నందునే ఇవి రాయడం సాధ్యపడింది. పుస్తకానికి పెట్టిన పేరు 'అమ్మ అజ్ఞానం' నెగెటివ్ షేడ్‌తో వుంది. ఆ పద్ధతే ఆకర్షిస్తుందని అనుకోవచ్చు కానీ అంతకన్నా చక్కని పేర్లు చాలానే వున్నాయి. 'పసిపిల్ల, నామకరణం' పరిశీలనార్హం. నవరస కథితం పేర ముందుమాట రాసిన రమాపతిరావు ప్రతి కథను నిశితంగా స్పృశించి విశ్లేషించారు.
- రాము ఇటిక్యాల, 9491068486
సమీక్షా మాలిక
సి.ఉమాదేవి
పేజీలు : 176
వెల : 120/-
ప్రతులకు : జ్యోతి వలబోజు
ఫోన్ : 8096310140
కాకీక కాకికి కాక
పాలపర్తి ఇంద్రాణి
పేజీలు : 88
వెల : 80/-
ప్రతులకు : కేరాఫ్ పాలపర్తి సువర్ణ లత, అపార్ట్మెంట్ 502, ఎపిహెచ్‌బి టవర్స్, జి.వి.ఆర్ మ్యూజిక్ కాలేజి ఎదురుగా, దుర్గాపురం, విజయవాడ - 520003
యుద్ధం మాట్లాడుతుంది
షహెబాజ్ అహ్మద్ ఖాన్
పేజీలు : 120
వెల : 80/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
నానీ మీగడలు
నాగం సాయిలు
పేజీలు : 52
వెల : 100/-
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు
రుక్మిణి కళ్యాణం
మమత ఐల
పేజీలు : 40, వెల :40/-
ప్రతులకు : మమత ఐల, బిల్డింగ్ 4-35-530/బి, ఫ్లాట్ నెం 202, వివేకానంద వెంకయ్య అకాడమీ, మాధవరం నగర్ కాలనీ, కమల్ ప్రసన్న నగర్, కూకట్పల్లి, హైదరాబాద్