Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది యకూటియాలోని (రష్యా) తిరెఖ్తాయక్ నదీ తీరం. పావెల్ ఎఫిమోవ్ అనే ఓ రష్యన్ పౌరుడు గత వేసవిలో చల్లని గాలుల కోసం ఆ ప్రాంతంలో తిరుగాడుతున్నాడు. అతడ్ని ఓ దృశ్యం ఆశ్చరానికి గురిచేసింది. మొండెం లేని జంతువు తల ఒకటి కనిపించింది. దాని వెంట్రుకలు, నోట్లోని పదునైన పండ్లతో సహా చెడిపోకుండా ఉండటం వల్ల అది ఒక తోడేలు తల అని ఆ వ్యక్తికి అర్థమయింది. అతడు శాస్త్రవేత్తల దగ్గరకు ఆ తలను తీసుకెళ్లి ఇచ్చాడు. వారు దాన్ని పరీక్షించి ఆ తల నలభై వేల ఏండ్ల క్రితం బతికున్న ఓ తోడేలుదని తేల్చి చెప్పారు. మంచు మహాయుగం (ప్లీస్టొసీన్) చివరికాలానికి చెందినదై ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు 'సైబీరియన్ టైమ్స్' పత్రిక ప్రచురించిన ఒక వార్తవల్ల తెలుస్తున్నది. ఈ తోడేలు మరణించే నాటికి రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఉందని శాస్త్రవేత్తలు అన్నట్లు ఆ వార్త తెలిపింది. దాని తల నలభై సెంటీ మీటర్ల పొడవు ఉన్నదట. అంటే ఆధునిక కాలంలో ఉన్న తోడేలు శరీరంలో సగం పరిమాణం ఉన్నదన్నమాట!