Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిమ కాలంలో మనుషులకు ఇప్పటిలాగ బట్టలు వుండేవి కావు. కొన్ని రకాల చెట్ల బెరడులను, జంతువుల చర్మాలనే దుస్తులుగా ఉపయోగించేవారు. కాలక్రమంలో వాటినే కొద్దికొద్దిగా మార్పులు చేసి అవసరానికి అనుగుణంగా, సౌకర్యవంతంగా వుండేలా మార్చుకున్నారు. దీనికోసం మీడియం సైజులో వుండే చెట్లను ఎన్నుకుంటారు. ఆల్చిప్పల ద్వారా చెట్ల కాండం నుండి బెరడుని జాగ్రత్తగా వేరు చేస్తారు. తర్వాత కొన్ని రోజులు ఆ బెరడుని నీళ్ళలో నానబెడతారు. వారి అవసరానికి అనుగుణంగా బెరడు నానిన తర్వాత చదునుగా వుండే ప్రదేశంలో నానిన బెరడు ముక్కలను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. బరువైన పరికరంతో ఈ ముక్కలను బాగా నలగ్గొడతారు. దాంతో ఆ ముక్కలన్నీ కలిసి పోయి ఒకే పెద్ద బెరడులా, పల్చగా తయారవుతుంది. దాన్నే వస్త్రంగా, రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇలా బెరడుతో చేసిన వస్త్రమే వాతావరణానినీ, మనిషికీ ఎటువంటి కాలుష్యాన్నీ కలిగించదు.