Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండె ఉర: పంజరంలో రెండు ఊపిరి తిత్తుల మధ్య అమరి, కొద్దిగా ఎడమవైపుకు వాలి ఉంటుంది.
- మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి.
- గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ధమనులు అంటారు. ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది.
- శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను సిరలు అంటారు. వీటిల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది.
- గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని తీసుకుపోయే నాళాలను పుపుస ధమని అంటారు. ఊపిరి తిత్తుల నుండి గుండెకు మంచి రక్తాన్ని తీసుకుపోయే నాళాన్ని పుపుస సిర అంటారు. అంటే పుపుస ధమనుల్లో చెడు రక్తం, పుపుస సిరల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది.
- గుండె సంకోచ వ్యాకోచాల ద్వారా రక్తాన్ని అన్ని శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది.
- గుండె జరిపే సంకోచ, వ్యాకోచాలను 'గుండె కొట్టుకోవడం' అంటారు.
- గుండె పరిమాణం మన పిడికిలి అంతే ఉంటుంది.
- ఆరోగ్యవంతుడైన మనిషి గుండె నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటుంది.
- నాడి కొట్టుకోవడాన్ని డాక్టర్లు చేతి మణికట్టు దగ్గర ధమనులలోని రక్త ప్రసరణను పరిశీలించుట ద్వారా తెలుసుకుంటారు.
- అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళేలోగా చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు.
- ప్రథమ చికిత్స చేసేవాళ్ళు మొదట తమ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
- ప్రథమ చికిత్స పెట్టెలో డెట్టాల్, స్పిరిట్, గాజు గుడ్డ, కత్తెర, అయోడిన్, దూది ఉంటాయి.
- ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఇస్మార్క్. ఇస్మార్క్ జర్మనీ దేశస్తుడు.