Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలైనా, ఇతర ఏ ఆహార పదార్థాలైనా చెడిపోవడానికి రెండు కారణాలుంటాయి. ఒకటి సూక్ష్మజీవులు, బాక్టీరియా వంటి వాటి వల్లనైతే, రెండో కారణం గాలితో రసాయనిక చర్య జరపడం వల్ల. సూక్ష్మజీవులు, బాక్టీరియా వంటివి తమకు కావాలసిన ఆహారం కోసం ఆహార పదార్థాల మీద వాలతాయి. అక్కడ అవి విసర్జించిన పదార్థాల వల్ల ద్రవ, ఘన రూపంలోని ఆహారం ఏ ఆహార పదార్థాలైనా పాడైపోతాయి. ఇక రెండోది... గాలిలోని ఆక్సిజన్‌తో ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఆహార పదార్థాలు చెడిపోవడమో, కుళ్ళిపోవడమో జరుగుతుంది.
ఈ రెండు విధాలుగా ఆహార పదార్థాలు చెడిపోకుండా వుండేందుకు... ముఖ్యంగా పాలు పాడైపోకుండా వుండడానికి టెట్రా ప్యాకెట్ రూపంలో నిల్వ చేస్తున్నారు. ఈ ప్యాకెట్లకు ఉపయోగించే మందపాటి కవర్లని సాంకేతిక పద్ధతుల్లో స్టెరిలైజ్ చేస్తారు. కొంచెం కూడా గాలి, సూక్ష్మజీవులు చేరకుండా చేరకుండా సీల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సూక్ష్మజీవులు, గాలి కవర్లోపలికి వెళ్ళలేవు. అందుకే లోపలి ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.