Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విటమిన్లు మన శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలు
- విటల్, అమైన్స్ అనే పదాల నుండి విటమిన్స్ అనే పదం రూపొందింది.
- సర్ హెచ్.జి.హుప్కిన్స్ 1912లో మొదటిసారి పాలల్లో విటమిన్లను గుర్తించారు.
- విటమిన్లు అనే పేరును సూచించింది 'ఫంక్'
- విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 'విటమినాలజీ'.
- విటమిన్లు ద్రావణీయత ఆధారంగా రెండు రకాలు.
1. కొవ్వులో కరిగే విటమిన్లు, 2. నీటిలో కిరిగే విటమిన్లు.
- కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె.
- నీటిలో కరిగే విటమిన్లు బి, సి
- విటమిన్లు ఎంజైములకు సహ ఎంజైములుగా పని చేస్తాయి.
- ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి.
- విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తినివ్వడంలో కానీ పాలు పంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి.