Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగా రాశారు
'కొంగు చాటు బిడ్డలు కారు పతకమెత్తిన 'షీ' రోస్' లో తెలుగు మహిళలు క్రీడారంగంలో వారు సాధించిన విజయాల గురించి చాలా బాగా వివరించారు. అనువాద కథ 'అనార్కలి' ఆసాంతం ఆసక్తి కరంగా సాగింది. 'రాత్రంతా రజనీగంధం' లో విద్యాసిన్హ గురించి బాగుంది. 'వానవెలిసింది' సింగిల్ పేజీ కథ సింప్లీ సూపర్బ్.
- యంపల్ల సుధాకర్ రెడ్డి; కందగట్ల, సూర్యాపేట
'సోపతి'కి హ్యాట్సాఫ్
వారం వారం భిన్నమైన కవర్ స్టోరీలతో అలరిస్తున్న 'సోపతి'కి మా ధన్యవాదాలు. 'సోపతి' పుస్తకం మిగిలిన పత్రికల అనుబంధాలకు భిన్నంగా, వైవిధ్యంగా ఉంటోంది. జాతీయ క్రీడాదినోత్సవ ప్రత్యేకవ్యాసం చాలా చాలా బాగుంది. భారత మహిళల గొప్పతనాన్ని వ్యాసం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపినందుకు రచయితకు అభినందనలు.
- సత్తెయ్య, యాదగిరి, దుబ్బాక; సందీప్, సాయి, శ్రీరామ్, వంశీకృష్ణ, నల్లగొండ
ప్రధానవ్యాసం శీర్షిక బాగుంది
భిన్నరకాల క్రీడల్లో భారత మహిళల ఘనతను చాటిచెప్పిన వ్యాసానికి తగిన శీర్షిక ఇచ్చినందుకు అభినందనలు. వ్యాసంలో మాకు తెలియని చాలా విలువైన సమాచారాన్ని, విశేషాలను ఇచ్చినందుకు రచయితకు ధన్యవాదాలు.
- 'ఆవిర్భావ' పత్రికాసిబ్బంది, హైదరాబాద్
'చౌరస్తా' ఆలోచింపచేసింది
గాడ్ ఫాదర్ ఉన్నవారికి, సరుకు లేని వారికి, పురస్కారాలు ఇవ్వడం వలన అవి తమ విలువను కోల్పోతవి. గ్రహీతలు తగిన గౌరవాన్ని పొందాలంటే వాటిని నూటికి నూరుపాళ్లు అర్హులైన వారికి ఇవ్వడం ఆలోచింపదగ్గ విషయం. పురస్కార గ్రహీతలు సమాజం ఎడల తమవంతు బాధ్యత కలిగి, పజాపక్షం వహిస్తే మరీ మంచిది.. అన్న 'అంతరంగం' సూచన ఆచరించదగ్గది. 'చౌరస్తా' .. పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ భర్తలను బాధించే భార్యల గురించి ఆలోచింప చేసే కథనం అందించింది. భార్యలకు తమ బోధనల ద్వారా నిర్హేతుక పరిహారాలను సూచించే స్వామీజీల మీద, టీవీ చానెళ్ల మీద కోర్టులో కేసు వెయ్యాలి అనుకునే భార్యా బాధితుల మనోభావాలు చింతపట్ల వారు చక్కగా పేర్కొన్నారు. స్వామీజీ సూచించిన పరిహారం వల్ల తల్లి కావడం హేతువుకు అందని విషయం. ఆరోగ్య శాస్త్రాన్ని పరిహసించడమే. మరో కోణంలో చూసినట్టవుతే, వ్రతాలు, నోములు, పూజలు పూజా సామగ్రి అమ్ముకొని జీవించే వారికి స్వయం ఉపాధి కల్పించడానికి చేసిన ఏర్పాటుగా భావించ వచ్చు. ఈ వారం కవితలో కూర్చునే బల్ల మీద రాసిన కవిత ఆకట్టుకుంది. అది అందరి బంధువు. అందరూ దాని బంధువులు. మన, తన బేధాలు లేని ఆసనమది.
- పంజాల నరసయ్య;
హైదరాబాద్