Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వస్తువు మీద మరో వస్తువు నిలబడగలిగే సామర్థ్యం నిలబెట్టుకునే వస్తువు నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. ఒలింపిక్ క్రీడల్లో బరువునెత్తడం కష్టమే కానీ ఎత్తిన బరువును నిలుపుకోవడం చాలా సులభం. ఎందుకంటే ఎత్తిన తర్వాత తమ శరీరాన్ని అందుకనుగుణంగా నిలుపుకుంటారు. చీమల బరువు తక్కువే ఉన్నా వాటి శరీరాకృతిలో గట్టి కైటిన్ అనే పదార్థం ఉంటుంది. సకశేరుక జీవులకు శరీరం లోపల అస్థిక నిర్మాణం వల్ల ఆకృతి, స్థిరత్వం వస్తుంది. చీమలు, తాబేళ్లు, గవ్వలు లాంటి అకశేరుక జీవులకు బాహ్య నిర్మాణం గట్టిగా ఉండటం ద్వారా స్థిరత్వం, స్వరూపం కలుగుతాయి. అందువల్లే చీమలు తమ కన్నా ఎక్కువ బరువును కూడా ఎత్తగలవు. చీమలు తమకు ఉపయుక్తమయిన పదార్థాలను గోళాకారంలోకి మార్చి దొర్లించుకుంటూ వెళ్తాయి. ప్రపంచంలో ఉన్న చీమల మొత్తం బరువు ప్రపంచంలో ఉన్న సకశేరుక జంతువుల మొత్తం బరువు కన్నా ఎక్కువ.