Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు : భార్య మాట పాటించేవాళ్లు ఓ వరుసలో, భార్య మాట వినని వారంతా మరో వరుసగా నిల్చోండి..
(భా.బా.సంఘం అధ్యక్షుడి మాట విన్న మగవారంతో ఓ లైన్లో నిల్చున్నారు.. ఒక్క వ్యక్తి మాత్రం భార్య మాట వినని వరుసలో ఉన్నాడు..)
భా.బా.సంఘం అధ్యక్షుడు : ఇక్కడున్న వారిలో భార్య మాట వినని వ్యక్తి మీరు ఒక్కరే అన్నమాట!
ఒక్క వ్యక్తి : అదేమీ కాదు సార్... ఈ లైన్లో నిల్చోవాలని ఆర్డర్ వేసింది మా ఆవిడే (నాలుక్కరుచుకున్నాడు)
వదిలేద్దాం!
రోడ్డు మీద రెండు రౌడీ చీమలు వెళ్తుంటాయి. దారిలో వాటికి ఓ ఏనుగు కనిపిస్తుంది...
1వ చీమ : అరె మామా నువ్వు వెళ్లి ఆ ఏనుగును నాలుగు తన్ని రా. ఏమైనా జరిగితే నేను చూసుకుంటా.
2వ చీమ : వద్దులేరా. మనం ఇద్దరం ఉన్నాం. వాడు ఒంటరిగా ఉన్నాడు. ఈసారికి వదిలెరు.
షాపింగ్ చేస్తే
జడ్జి : ఏం తప్పు చేశావని నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు? దొంగ : షాపింగ్ చేశానని లాక్కెళ్లి కటకటాల వెనకాల వేశారు సార్..
జడ్జి : షాపింగ్ చేయడమేమీ నేరం కాదు. అసలేం జరిగిందో చెప్పు.. లేకపోతే రెట్టింపు శిక్ష పడుతుంది.
దొంగ : ఆ షాపు తెరవకముందే షాపింగ్ చేశానంతే సార్.
పరీక్ష
తండ్రి : ఏరా వికాస్... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు.. నువ్వెన్ని రాశావ్?
కొడుకు : వాళ్లు 25 మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు. నేను మొదటి రెండు.. చివర మూడు వదిలేసి రాశాను.
బోరింగ్ చెడిపోయింది
వసుధ : ఏమయ్యా... ఈరోజు పాలు ఇంత చిక్కగా ఉన్నాయి... ఎప్పుడు ఇలాగే పొయ్యొచ్చుగా.
పాలవాడు : ఇంటిలో బోరింగ్ చెడిపోయిందమ్మా... నీళ్ళు సరిపోలేదు.
గుణపాఠం
భార్య : పనమ్మారు అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త : సాయంత్రం వస్తుందిగా. అప్పుడు నేనూ రాసుకు పూసుకు తిరిగి తగిన గుణపాఠం చెప్తాను..
పనికిరాని ఫలం
టీచర్ : తినడానికి పనికి రాని ఫలం ఏమిటో చెప్పు?
విద్యార్థి : ఇంకేముంటాయి సార్.. వారఫలాలు.
తేడా
భర్త : నీ సుపుత్రుడు మళ్ళీ చెప్పకుండా నా జేబులోంచి డబ్బులు తీశాడు.
భార్య : ఎందుకు ఎప్పుడు వాడిమీద అలా విరుచుకుపడతారు. ఆ డబ్బులు వాడే తీశాడని ఏంటి గ్యారంటీ. నేను తీసి ఉండొచ్చుగా.
భర్త : నువ్వు కాదని తెలుసులే. నువ్వైతే మొతం తీసేదానివి, జేబులో ఇంకా రెండొందలు మిగిలే ఉన్నాయి.
ప్రాక్టీస్
సుబ్బారావు : ఎంత ధైర్యం ఉంటే నా జేబులో పర్సు తీస్తావురా దొంగ రాస్కెల్?
దొంగ : ఇది నిజమైన దొంగతనం కాదు సార్. జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే.