Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంగళప్ప తన బైక్ అన్ని డాక్యుమెంట్లతో వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఆపారు. చాలా సంతోషంగా ఒక్కో పేపర్ తీసి పోలీసులకు గర్వంగా చూపించిన వెంగళప్ప ఇకవెళ్లవచ్చా సార్ అని అడిగాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ 5 వేల రూపాయలు చలానా రాసేసరికి వెంగళప్ప కంగుతిన్నాడు..
వెంగళప్ప : అన్ని డాక్యుమెంట్లున్నాయి కదా.. చలానా ఎందుకని ప్రశ్నించాడు
ట్రాఫిక్ పోలీస్ : అంతా ఓకే కానీ.. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లో వీటిని దాచావు. ఇప్పుడు అర్థమైందా చలానా ఎందుకో.
విసిగిస్తుందని!
చీరల షాపింగ్ పూర్తి చేసుకుని భార్యాభర్తలు బైకుమీద ఇంటికి వెళ్తున్నారు.
భార్య : ఏవండీ.. బండి తిప్పండి. చీరలు కొన్న షాషింగ్ మాల్‌కు వెళ్లాలి
భర్త : ఏం జరిగిందే! పట్టుచీరలేమైనా షాపులోనే మరిచిపోయావా ఏంటి?
భార్య : వాటిని ఎలా వదిలిపెడతానండీ.. చీరలు చూస్తుంటే విసిగిస్తుంటే మన బుజ్జితల్లిని అక్కడే కూర్చోమన్నాను.
అబ్బాయిలే...
రాము : ఎప్పుడూ అబ్బాయిలే వెధవల్రా జానూ..!
జాను : ఏరా రామూ.. అబ్బాయిలే వెధవలని అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు?
రాము : అమ్మాయి ప్రేమలో పడితే.. ఆమె ప్రేమించిన అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు ఎవడే ఆ వెధవా..?! అని అడుగుతారు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసినా.. ఓరే వెధవా ఎవర్రా ఆ అమ్మాయి..? అంటారు.. అందుకే ఎప్పుడూ అబ్బాయిలే వెధవలుంటున్నా..!
హార్రర్ సినిమా
భార్య : ఏమండీ... ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండీ.....
భర్త : సరే... లోపలికి వెళ్లి మన పెళ్లి సి.డీ పట్టుకురా.
ఎలా జంప్ చేస్తుంది?
బంటి : చింటూ.... పొయ్యి మీద పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంది.
చింటూ : నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చుని చూడు తెలుస్తుంది.
గుర్తుకొస్తున్నాయి
మామయ్య : చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది?
చింటూ : వినాయకుడు...
మామయ్య : మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ : నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
ఖరీదైన రాయి
ఒక ఉంగరం వేలుకి పెట్టుకుని తిరుగుతున్నాడు రంగారావు. ఆ ఉంగరంలోని రాయిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఉండబట్టలేక రంగారావును అతని స్నేహితులు అడిగారు...
స్నేహితులు : రంగారావూ... నీ వుంగరం బాగుంది కానీ అందులోని రాయి మాత్రం ఏమీ బాగాలేదయ్యా.
రంగారావు : ఈ రాయి 2 లచ్చల రూపాయలు. తెలుసా?
స్నేహితులు : అబ్బో... అంత ఖరీదా??... అసలు ఇది ఏం రాయి?
రంగారావు : మొన్న ఆపరేషన్ చేపించుకున్నానుగా... నా కిడ్నీలోది..... బిల్లు 2 లచ్చలు వేశారు. తెలుసా?
కోడి పేర్లు
పిల్ల కోడి : అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లుండవు?
తల్లి కోడి : మనక్కూడా ఉంటాయే. కాకపోతే మనుషులకు పుట్టగానే పెడతారు. మనకు చచ్చిపోయాక పెడతారు... చికెన్ టిక్కా, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై, చికెన్ కడాయి ఇలాగన్నమాట.