Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి నీళ్ళు తాగినప్పుడు రుచిగా ఉండటానికి కారణం ఆ నీటిలో కరిగి ఉన్న లవణాలు. వర్షపు నీరు ఆకాశంలోని మేఘాల నుంచి నేలపై పడేటపుడు ఆ నీరు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది. ఆ నీరు నేలపై పడిన తర్వాత భూమి లోపలి పొరలలోకి ఇంకిపోతుంది. అలా ఇంకి పోతున్న నీరు అక్కడి సున్నపు పొరలలో ఉండే కాల్షియం కార్బోనేట్‌ను కాల్షియం బై కార్బోనేట్‌గా మార్చి తనలో కలుపుకుంటుంది. ఈ బై కార్బోనేట్, నీటికి ఒక రుచిని సమకూరుస్తుంది. అప్పటికే నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్, నీటిని శుభ్ర పరిచేందుకు అందులో కలిపిన క్లోరిన్... ఈ పదార్థాలన్నీ కలిసి మనం తాగే నీటికి రుచిని కలిగిస్తాయి.
ఆ నీటిని పాత్రలో తీసుకుని పొయ్యిపై మరిగిస్తే అందులో కలిసి ఉన్న రసాయనిక పదార్థాలన్నీ వాయువు రూపంలో బయటకుపోతాయి. దాంతో ఆ మరగ కాచిన నీటిని చల్లార్చితాగితే రుచీపచీ లేకుండా చప్పగా ఉంటాయి.