Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీని రసాయన నామాలు 'నియాసిన్', 'నికోటిక్ ఆమ్లం' 'నికోటినమైడ్'.
- వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4డి విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్- పిపి.
- ఇది ఎన్.డి.పి, ఎ.డి.పి. సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
- ఈ విటమిన్‌ని ఆక్సీకరణ, ఉష్టం తేలికగా నాశనం చేయలేవు.
- పెదాలు లావెక్కడం, మచ్చలతో, అరిచేతుల చర్మం మందంగా తయారవడం, పెల్లాగ్రా వంటివి ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు. చర్మం గరుకుగా తయారై, పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని 'పెల్లాగ్రా' అంటారు.
- ముల్లంగి, బఠాణీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగలో విటమిన్ బి3 లభ్యమవుతుంది.
విటమిన్ - బి 5
- దీని రసాయన నామం 'పాంటోథెనిక్ ఆమ్లం'.
- ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని 'సర్వ విస్తృత విటమిన్' అంటారు.
- గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతిచోటా అని అర్థం.
- ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు... పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్. కీళ్లవాతాన్నే ఆర్థరైటిస్ అంటారు.
- అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని 'బర్నింగ్ ఫీట్' అంటారు.
- ఈ విటమిన్ లభ్యమయ్యే పదార్థాలు : కాయగూరలు, కాలేయం, గుడ్లు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు.