Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలు సిసలు సృజనకు రచయిత మరణానంతరమూ నిలిచి వెలుగురతుందని చెప్పడానికి తార్కాణం కాఫ్కా సాహిత్యం. ప్రసిద్ధి చెందిన మెటా మార్ఫసిస్ కథలతో పాటు మరికొన్ని కథల్ని మెహర్ అనువాదం చేశారు. దాదాపు పాతిక పేజీలకు పైగా కాఫ్కా జీవితం, సాహిత్యం గురించిన పరిచయం అందించారు. ఇదివరలో కాఫ్కా కథల్లో కొన్నిటిని జి. లక్ష్మి అనువదించారు. ఇపుడు మెహర్ అనువాదం చేసిన ఏడు కథలు బాగున్నాయి. 95 ఏళ్ళ కిందట కాఫ్కా మరణించాడు. ఇప్పటికీ దేశదేశాల ప్రజలు కాఫ్కా కథలు చదువుతున్నారు. మన దగ్గర త్రిపుర మీద కాఫ్కా ప్రభావం ఉంది. కాఫ్కా కథల గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. వీటిని చదివితే కాఫ్కా సాహిత్యం మొత్తం చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది. ఇలాంటి తపనకు లోను చేయడం మెహర్ అనువాద సాఫల్యం.
- వికర్ణుడు
ఫ్రాంజ్ కాఫ్కా మెటా మార్ఫసిస్ ఇంకొన్ని కథలు, అనువాదం: మెహర్, పేజీలు: 128, వెల: రూ. 100, ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ, ఫోను: 9866115655