Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలపళ్ళు కనిపించాక పిల్లలకు బ్రెషింగ్ చేయొచ్చు అంటారు డాక్టర్లు. పేస్ట్ బ్రెష్ పైన వేసి నోట్లో పెట్టగానే పిల్లలు చప్పరించేస్తుంటారు. ఇండ్లలో సాధారణంగా ఫ్లోరైడ్ కలిగిన పేస్ట్ వాడుతుంటారు. ఈ ఫ్లోరైడ్ వాడకం వల్ల దంతాల ఆరోగ్యం బావుంటుందం టారు... కానీ పిల్లలు ఈ పేస్ట్ తినేయడం మటుకు వాళ్ళకు ఆరోగ్యకరం కాదు. బ్రెష్ చేసేటప్పుడు బియ్యపు గింజపరిమాణంలో వేస్తే చాలు. మూడేళ్ళు వచ్చాక దాన్ని కాస్త పెంచుతూ పోవచ్చు. ఆరేళ్ళు వచ్చాక బ్రెష్ నిండా పేస్ట్ వేసిన ఏంకాదు. సంవత్సరం నిండాక దంతవైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.