Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేస్తాలూ! ఎడారిలో నీళ్లు దొరుకుతాయా! ఊహు ఎడారంటేనే ఇసుక దిబ్బలతో ఉన్న తడిలేని ప్రాంతం కదా అంటారా! కానీ తెలుసా! నీళ్లే దొరకని ఎడారిలో ఏకంగా సరస్సులే ఉన్నాయి మరి. ఎక్కడా! లిబియా దేశంలో! అక్కడ ఓ ప్రాంతమంతా విస్తారమైన ఇసుక దిబ్బలుంటాయి. అందుకే ఆ ప్రదేశాన్ని 'ఉబరి ఇసుక సముద్రం' అంటారు. దీని ప్రత్యేకతేంటంటే ఇక్కడ దాదాపు 20 మంచినీటి సరస్సులను గుర్తించారు పరిశోధకులు. ఎడారిలాంటి ప్రాంతంలో సరస్సులు ఎలా వచ్చాయంటారా! నిజానికి 2 లక్షల ఏండ్ల కిందట ఈ ఇసుక సముద్రమంతా నదులతో సరస్సులతో ఉండేదని అన్వేషకులు చెబుతున్నారు. కాలక్రమేణా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇలా ఎడారిలా మారిపోయిందట. అయితే అప్పటి నదులన్నీ ఇసుకతో కప్పేసినా అక్కడక్కడ చిన్నచిన్న సరస్సులు మాత్రం ఇంకా ఉన్నాయి. చుట్టూ ఇసుక.. మధ్య మధ్యలో సరస్సులు.. వాటి చుట్టూ కొబ్బరి, తాటిచెట్లు... చూడ్డానికి ఎంతందంగా ఉందో ఆ ప్రాంతం.