Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథ నడిపే విధానం, చలనం, జీవనం తెలిసి కథలు రాస్తున్న రచయిత్రి డా||లక్ష్మీరాఘవ, 'ఆత్మీయులు' మొదలు 'ఎడం' వరకు 23 కథలు గల సంపుటి పేరు 'ఆత్మీయులు'. ఇందులో ప్రతి కథలో సామాజిక జీవనం ఎటువంటి ఆర్భాట లోపాలు లేకుండా చిత్రీకరించారు రచయిత్రి. అవయవ దాన ప్రత్యేకతను తెలిపే కథ 'ఆత్మీయులు'. ఇది ఆత్మీయతనే ఆత్మీయులకి అర్థం తెలియజెప్పే విధంగా రాశారు. పూవు వంటి సున్నిత హృదయం ఉన్నవారికే ఈ పూలభాష తెలుస్తుందని తెలియజెప్పే కథ 'తోటలో ఒకరోజు'. 'ఇల్లాలు' కథలో ఇంటి ఆవిడ ఔన్నత్యాన్ని, అవసరాన్ని నొక్కి చెప్పే కథనం బాగుంది. 'ఆలోచన' కథలో ఆలోచనలు చక్కగా చేయాలని, అలా అయితేనే ఆచరణ సక్రమంగా వుంటుందనే ఇతివృత్తాన్ని చూపారు. మానవత్వం ఎప్పుడూ నికరంగా వుంటుంది. అది సజీవం. ఉద్యోగ జీవితాలు వంటివి అశాశ్వతమైనవి. మనిషికి కావలసింది ఎప్పటికైనా మానవత్వమే అని తెలియజెప్పే కథ 'టెంపరరీ'. ఇలా అన్ని కథలూ విభిన్న రీతిలో సరళంగా స్పష్టంగా సాగి వున్నాయి.
- కె.హరనాథ్, 9703542598
ఆత్మీయులు, డా||లక్ష్మీరాఘవ, పేజీలు:144, వెల:100/-, ప్రతులకు:రచయిత్రి, 3-99, అప్పాగారివీధి, కురబాలకోట, చిత్తూరు