Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైకాసురులకు జంధ్యాల హెచ్చరిక
మైక్ దొరికితే చాలు వినేవారి బాధను అర్థం చేసుకోకుండా చాలా సేపు మాటల తూటాలతో బాది బాది వదిలిపెట్టే వారిని మైకాసురులంటారు ముద్దుగా. ప్రముఖ సినీ రచయిత, దర్శకులు జంధ్యాల ఏ సభకైనా అధ్యక్షత వహించ వలసి వస్తే, ఉపన్యాస మైకాసురులకు ముందస్తు హెచ్చరికగా ఓ జోక్ చెప్పే వారు. అది ఏమిటంటే 'ఓ సభలో ఒక ప్రముఖుడు తన భార్య కూడా సభలో ఉండడంతో మామూలుగా కంటే మరింత మోతాదులో రెచ్చిపోయి ఉపన్యాసం ఇస్తు న్నాడు. అది ఎంతకీ ఆగడం లేదు.. ఇంతలో ఆయనకు ఓ చీటీ వచ్చింది భార్య దగ్గర్నుంచి! దాని మీద పెద్ద పెద్ద అక్షరా లతో ఇంగ్లీషులో కె.ఐ.ఎస్.ఎస్ (కిస్) అని రాసి ఉంది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ముగించి కూర్చున్నాడు'. ఆయన పక్కనే కూర్చున్న మరో మైకా సురుడు ఆ చీటీ చూసి ''మీ భార్యకు మీ మీద అంత ప్రేమన్న మాట'' అన్నాడు. ''అబ్బే.. అది ప్రేమ కాదండీ.. కె.ఐ. ఎస్.ఎస్ అంటే 'కీప్ ఇట్ షార్ట్ స్టుపిడ్' అని ఆ నాలుగు అక్షరాలతో నన్నలా హెచ్చ రించింది'' అని విచారంగా చెప్పాడు. 'కాబట్టి అలాంటి పరిస్థితి మన సభలోని వక్తలకు రాకూడదు' అని అందరినీ నవ్వి స్తూనే మైకాసురులను హెచ్చరించేవారు జంధ్యాల.