Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కాలపు గొప్ప వైజ్ఞానికుడు స్టీఫెన్ హాకింగ్. కేవలం 76 సంవత్సర కాలంలో ఎన్నో విజ్ఞాన శాస్త్ర విషయాలను విశ్వ ప్రపంచానికి అందించిన మహానీయుడు హాకింగ్.
కొంతమంది మనుషులు మాత్రం కొత్త దారులను వెతుకుతూ కొత్త ప్రదేశాలకు చేరుకుంటారు. వారి వెంట ఎవరైనా నడిస్తే అక్కడ దారి ఏర్పడుతుంది. ఐన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం అణు నిర్మాణానికి సంబంధించిన క్వాంటమ్ సిద్ధాంతాన్ని సమన్వయం చేసేలా పలు సూత్రాలు ప్రతిపాదనలు చేసారు హాకింగ్. థీయరీ ఆఫ్ ఎవిరిథింగ్, పెరోజ్ ప్రతిపాదించిన సింగులారిటీ లాంటి సిద్ధాంతాన్ని విశ్లేషణ చేయడం గొప్ప విషయం. ఆ పనే చేసాడు హాకింగ్. తనంతటగా తాను కదలలేని హాకింగ్ ప్రపంచాన్ని కదిలించాడు. చక్రాల కుర్చీలో కంప్యూటర్ సాయంతో మాట్లాడుతూ.. జీవిత కాలమంతా అతను బ్లాక్ హౌల్స్ గురించి పరిశోధనలు, వ్యాసాలు, పుస్తకాలు రాసాడు. ''ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం'' అనే పుస్తకం కోటి ప్రతులు అమ్ముడుపోయింది. అలాగే ''ఫ్రమ్ ధ బిగ్ బ్యాంగ్ టు బ్లాక్ హౌల్'' అన్న గ్రంథం సినిమాగా 1988 సంపప వచ్చింది. తన వ్యాసాల్ని 2000 సంపపలో ''దయానివర్స్ ఇన్ ఎనట్ షెల్'' కూడా పేరు వచ్చింది. స్టీఫెన్ హాకింగ్ కూతురు లూసీ 2004 సంపప ''జేడెడ్'' అనే నవల రాసింది. హాకింగ్ అనేక దేశాలు పర్యటన చేసాడు. 2010 సంపపలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ పాసడేనా, కాలిఫోర్నియా వారు హాకింగ్ కు కాస్మాస్ అవార్డ్ ఇచ్చారు. గ్రాండ్ డిజైన్ పుస్తకంలో దేవుని ప్రమేయం సైన్సు అక్కరలేదన్నాడు. 13 గౌరవ డిగ్రీలు అందుకొన్నాడు. మై బ్రీఫ్ హిస్టరీ పదగ్రాండ్ డిజైన్/ బ్లాక్ హౌల్స్ - రైత్ లెక్చర్స్ - లూసీతో పిల్లలకోసం 5 పుస్తకాలు రాసాడు. 1970లో బ్లాక్ హౌల్ డైనమిక్స్ ఆవిష్కరణ, 2007 జిరో గ్రావిటిలో ఎగిరాడు - బ్రిఫ్ ఆన్సర్ టు బిగ్ క్వశ్చన్స్.. లాంటి మేధావి - 2018 మార్చి 14 మరణించాడు. హాకింగ్స్ సైన్స్ అంశాల్ని సాధికారికంగా శుభోదకరంగా అర్థమైన శైలిలో అందించిన మేధావి కె.బి గోపాలం అభినందనీయులు. నవతెలంగాణ కషికి అభినందనలు.
రచయిత : కె.బి.గోపాలం, పేజీలు : 120, వెల: 120, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎమ్, హెచ్.భవన్ - ప్లాట్ నెం:21/1 అజామాబాద్. ఫోన్ : 9490099378/373/350
- తంగిరాల చక్రవర్తి