Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎటు చూసినా కొండలు.. జలపాతాలు.. ఎప్పుడూ చల్లని వాతావరణం.. వర్షాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి.. వేసవిలో సైతం తేమగా ఉండే ప్రాంతం.. ఇక చలికాలం గురించి చెప్పనవసరమే లేదు.. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సోరి పర్వత ప్రాంతం.. ఈ ప్రాంతమంతా హిల్ స్టేషనే.. డెహ్రాడూన్‌కు 35కిలో మీటర్లు.. ఢిల్లీకి290 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఎటుచూసినా కొండలతో పాటు హిమాలయాలకు దగ్గరగానూ ఉండే ప్రాంతం.. అందుకే దీనిని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు..