Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియ, నందితాదాస్ వంటి తారలు ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్ వాళ్లపై ఉద్యమ స్థాయిలో నిరసనలు ప్రకటిస్తున్నారు. 'మీకు అమ్మాయిలంటే ఆట బొమ్మలుగా కనిపిస్తు న్నారా? మా క్రీమ్ వాడండి.. సమస్య నుంచి బైట పడండి అనే ధోరణిలో మీరు ప్రచార చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఆ విధంగా యువతులంటే అందాలు, ఆకర్షణలకే పరి మితం అన్నట్లు చులకన చేస్తున్నారు. ఇలా స్త్రీలను కించ పరిచేలా ప్రకట నలు ఇస్తున్న వారందరి పైనా మహిళా సంఘాలు చర్య తీసు కోవాలి. తెల్లగాలేక పోతే పెళ్లి కాదని తీర్మానించ డానికి మీరెవరు? ఇటు వంటి ధోరణికి మేము నిరసన తెలుపుతున్నాం. స్త్రీ వ్యక్తిత్వానికి గౌరవమిచ్చేలా ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా నా సహకారం ఉంటుంది' అని అంటోంది ప్రముఖ తార శ్రియ.
అలాగే తారలను 'మీ పెళ్ళెప్పుడు?' అని అడిగితే జర్నలిస్టులపైనా ఆమె విరుచుకు పడుతోంది. 'మీ జర్నలిస్టులకు మా పెళ్ళిళ్ళు తప్ప, అడగడానికి ఇంకే విషయాలూ ఉండవా? పెళ్ళి కాని తారలను ఇలాంటి ప్రశ్నలతో విసిగించడం మానేయండి' అని చురక వేసినట్లుగా హితవు చెబుతోంది.
'స్త్రీలను కించపరుస్తున్నారు' అని గోల చేస్తోన్న శ్రియ- మరి సినిమాల్లో తాను వేసే సెక్సీ దుస్తులూ, ఉద్రేకపరచే విధంగా ఉండే డాన్స్ స్టెప్పులూ ఇవన్నీ స్త్రీల వ్యక్తిత్వానికి గౌరవం తీసుకొచ్చేవేనా?' అని జర్నలిస్టులు ఆమె ధోరణికి విస్తుపోతున్నారు.