Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లీ జురురుతో గెలుపుపై సింధు
హైదరాబాద్ : వరల్డ్ చాంపియన్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పి.వి సింధు టోక్యో ఒలింపిక్స్ పసిడి రేసులో హాట్ షట్లర్. చిన్న చితకా షట్లర్లతో అలవోకగా ఓడిన సింధు.. మేటి క్రీడాకారిణులతో ఆడినప్పుడు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనే చేసింది. సింధు ఉత్తమ ప్రదర్శన చూడాలంటే, ఆమెకు ఎదురుగా ఉత్తమ ప్రత్యర్థిని బరిలోకి నిలపాల్సిందే. 2013 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు 2018 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. కెరీర్లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది. ' నా కెరీర్‌కు మలుపు తిప్పిన సంఘటన, 2012 ఒలింపిక్ చాంపియన్ లీ జురేరుపై విజయం. ఆ సమయంలో లీ జురేరు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. చైనా ఓపెన్ మాస్టర్స్ క్వార్టర్ఫైనల్లో (2012)ఆమెను ఓడించటం నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. రియో ఒలింపిక్స్ విజయంతో ఎన్నో విలువైన బహమతులు అందుకున్నాను. కానీ నా హృదయానికి హత్తుకునే బహమానం ఓ అభిమాని నుంచి వచ్చింది. తన నెల జీతాన్ని కానుకగా పంపించాడు. అతడికి నేనో ఉత్తరం రాసి, కొంత డబ్బు సైతం పంపించాను. కెరీర్ అసాంతం బ్యాడ్మింటన్తోనే దోస్తీ. లాక్డౌన్లో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. కుకింగ్, బేకింగ్, పెయింటింగ్ వంటి కొత్త పనుల్లో ప్రవేశం పొందుతున్నాను' అని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ముదిత్ డానితో టాక్ షోలో పివి సింధు తెలిపింది.